...
...
Next Story

టీజీఎస్ఆర్టీసీ పరిధిలోని 10 రీటైల్ ఫ్యూయల్ అవుట్‌లెట్ల నిర్వహణకు టెండర్లు

తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) పరిధిలోని 10 రీటైల్ ఫ్యూయల్ అవుట్‌లెట్ల నిర్వహణకు కాంట్రాక్టర్ల నుండి టెండర్ల ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 జూలై 2026గా నిర్ణయించారు.

Published on: Jul 1, 2026, 16:32:31 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు ప్రజలకు మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటు చేసిన, ఏర్పాటు చేయబోతున్న రీటైల్ ఇంధన విక్రయ కేంద్రాల(Retail Fuel Outlets/పెట్రోల్-డీజిల్ బంకులు) నిర్వహణ, ఆపరేషన్స్ కోసం అర్హులైన కాంట్రాక్టర్ల నుండి బిడ్లను ఆహ్వానిస్తోంది. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, నేతృత్వంలో ఈ టెండర్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.

టీజీఎస్ఆర్టీసీ టెండర్లు
టీజీఎస్ఆర్టీసీ టెండర్లు

టెండర్ నోటిఫికేషన్‌ను సంస్థ రెండు విభాగాలుగా విభజించింది. మొత్తం 10 ప్రాంతాలకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

ప్రారంభమైన అవుట్‌లెట్లు (Commissioned Outlets) టెండర్ ఐడీ 712080గా ఉంది. ఇప్పటికే ప్రారంభమై, నిర్వహణకు సిద్ధంగా ఉన్న 5 ప్రాంతాల అవుట్‌లెట్ల కోసం ఈ టెండర్ ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అవి రేగోడ్, లింగంపేట్, నవీపేట్, ఇందల్వాయి, నారాయణ్‌ఖేడ్,

ఎన్‌ఓసీ, ఆపరేషన్స్ అవుట్‌లెట్లు (Obtaining NOC and Operation of Outlets) టెండర్ ఐడీ 712240. అధికారిక అనుమతులు పొంది, త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్న మిగిలిన 5 ప్రాంతాల కోసం ఈ టెండర్ ఐడీ కేటాయించారు. అవి అమ్రాబాద్, దామరచర్ల, చంద్రగొండ, పరిగి, ప్రజ్ఞాపూర్‌లో ఇవి ఉన్నాయి.

ఆర్టీసీ ఇంధన కేంద్రాల నిర్వహణకు ఆసక్తి గల కాంట్రాక్టర్లు ఆన్‌లైన్ ద్వారా తమ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 జూలై 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)కు ఉన్నది. టెండర్ ఐడీలు చూసుకుంటే.. 712080, 712240.

ఈ టెండర్లకు సంబంధించిన పూర్తి నిబంధనలు, అర్హతలు, ఇతర వివరాల కోసం దరఖాస్తుదారులు టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tgsrtc.telangana.gov.in ను సందర్శించవచ్చు. అదనపు సమాచారం లేదా సందేహాల నివృత్తి కోసం అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ +91 7981628636ను సంప్రదించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe