TGSRTC AC Bus Charges : గ్రేటర్ ప్రయాణికులకు అలర్ట్ - ముగిసిన సమ్మర్ డిస్కౌంట్, మళ్లీ పాత ఛార్జీలు..!
TGSRTC AC Bus Charges : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు అందించిన మూడు నెలల సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ మే 31తో ముగియనుంది. జూన్ 1, 2026 నుండి పాత చార్జీలే వర్తిస్తాయని టీజీఎస్‌ఆర్‌టీసీ స్పష్టం చేసింది.
TGSRTC AC Bus Charges : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే సిటీ బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులకు ఊరట కలిగిస్తూ ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రవేశపెట్టిన మూడు నెలల ‘సమ్మర్ డిస్కౌంట్’ (Summer Discount) ఆఫర్ మే 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్ 1, 2026 (సోమవారం) నుంచి ఆయా బస్సుల్లో పాత (సాధారణ) చార్జీలను పునరుద్ధరించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

నగరంలో పీక్ సమ్మర్ (వేసవి కాలం) లో సాధారణ ప్రజలకు కూడా ఏసీ ప్రయాణాన్ని అందుబాటు ధరల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో టీజీఎస్ఆర్టీసీ ఈ ప్రత్యేక రాయితీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మూడు నెలల పాటు కొనసాగిన ఈ ఆఫర్…. గ్రేటర్ పరిధిలో నడిచే మెట్రో డీలక్స్ (Metro Deluxe), ఈ-మెట్రో ఏసీ (e-Metro AC) బస్సులకు వర్తింపజేశారు.
చార్జీల పెంపు కాదు: ఆర్టీసీ క్లారిటీ
చార్జీల పునరుద్ధరణపై ప్రయాణికుల్లో ఎలాంటి గందరగోళం నెలకొనకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యం ముందుగానే ఒక ప్రకటనలో స్పష్టతనిచ్చింది. జూన్ 1 నుంచి చార్జీలు పెరగడం అంటే.. కొత్తగా బస్సు చార్జీలను పెంచడం (Fare Hike) కాదని అధికారులు తెలిపారు. వేసవి కాలం కోసం ప్రత్యేకంగా ఇచ్చిన తాత్కాలిక రాయితీ గడువు మాత్రమే ముగుస్తోందని…. బస్సుల బేస్ ధరలలో (Base Prices) ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న ధరలనే పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మూడు నెలల కాలంలో సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని, సంస్థ ఆదరణకు తోడ్పడిన నగర ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. జూన్ 1 నుంచి ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారు ఈ మార్పును గమనించాలని…. కండక్టర్లతో అనవసర వాదనలకు దిగకుండా సహకరించాలని ఆర్టీసీ అధికారులు కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

