TGSRTC Recruitment 2026 : తెలంగాణ ఆర్టీసీలో 198 ఉద్యోగాలు - హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
టీజీఎస్‌ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్లు, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రెయినీ పోస్టుల రాత పరీక్ష హాల్ టికెట్లు వచ్చేశాయి. ఈ నెల 29న ఎగ్జామ్ ఉంటుంది. https://www.tgprb.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి.
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వీటిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈనెల 29న పరీక్ష…
ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 10 గంటలకు ఉంటుంది. ఇక మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహిస్తారు. టీఎస్‌టీ పోస్టులకు 20,097, ఎంఎస్‌టీ పోస్టులకు 6,063 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇలా…
- అభ్యర్థులు https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- సూపర్ వైజర్ ట్రైనీయిస్ రిక్రూట్ మెంట్ 2025 ఆప్షన్ లోని హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ తోపాటు క్యాప్చాను ఎంట్రీ చేసి లాగిన్ కావాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
ఈ రాత పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. 3 గంటల సమయం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (84), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ - 114 పోస్టులను భర్తీ చేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

