గుడ్​ న్యూస్​! దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్​ పోస్టులు- రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే నియామకం..

South Central Railway Apprentice Recruitment 2026 : దక్షిణ మధ్య రైల్వే భారీ స్థాయిలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిక్రూట్​మెంట్​ ప్రక్రియను ప్రారంభించింది. 10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది.

Published on: Mar 17, 2026, 10:00:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​! దక్షిణ మధ్య రైల్వే (ఎస్​సీఆర్​) పరిధిలోని వివిధ రైల్వే వర్క్‌షాపులు, డివిజన్లు, యూనిట్లలో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం 2,801 ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్​ఆర్​సీ) రిక్రూట్​మెంట్​ ప్రక్రియను ప్రారంభించింది. అప్రెంటిస్ చట్టం 1961, అప్రెంటిస్‌షిప్ నిబంధనలు 1962 ప్రకారం ఈ నియామకాలు జరగనున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్​ పోస్టులు..
సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్​ పోస్టులు..

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు..

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్​ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చ్​ 12, 2026 సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 11, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2026- ఖాళీలు ఉన్న ట్రేడ్‌లు..

ఈ నోటిఫికేషన్ ద్వారా

ఫిట్టర్

ఎలక్ట్రీషియన్

వెల్డర్

డీజిల్ మెకానిక్

కార్పెంటర్

ఏసీ మెకానిక్

కోపా వంటి సాంకేతిక విభాగాల్లో శిక్షణ ఇస్తారు.

ఇతర ట్రేడ్‌లలో ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, ఎమ్‌ఎమ్‌టిఎమ్, మోటార్ మెకానిక్ వెహికల్, పెయింటర్ వంటి విభాగాలు కూడా ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2026- శిక్షణ కేంద్రాలు..

సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్లతో పాటు తిరుపతి, లాళ్లాగూడ, రాయనపాడు వర్క్‌షాపులలో శిక్షణ ఉంటుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, పర్సనల్, సిగ్నల్ అండ్​ టెలికమ్యూనికేషన్స్ విభాగాల పరిధిలో ఈ శిక్షణ కొనసాగుతుంది.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2026- విద్యార్హతలు..

గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (ఎస్​ఎస్​సీ)లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

సంబంధిత ట్రేడ్‌లో ఎన్​సీవీటీ లేదా ఎస్​సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి.

దరఖాస్తు చేసే సమయానికే ఈ అర్హతలు కలిగి ఉండాలి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఈ పోస్టులకు అర్హులు కారు.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2026- వయోపరిమితి..

(ఏప్రిల్ 11, 2026 నాటికి):

కనీస వయస్సు: 15 ఏళ్లు.

గరిష్ట వయస్సు: 24 ఏళ్లు.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2026 వయో సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్​సీఎల్​) అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు (పీడబ్ల్యూబీడీ) 10 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2026- ప్రాంతీయ అర్హత..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణ: అన్ని జిల్లాలు.

ఆంధ్రప్రదేశ్: మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలు.

మహారాష్ట్ర: అకోలా, అమరావతి, ఔరంగబాద్, బీడ్, చంద్రపూర్, హింగోలి, జల్నా, లాతూర్, నాందేడ్, నాసిక్, పర్భాని, వాషిమ్, యవత్మాల్.

కర్ణాటక: బాల్కి, బళ్లారి, బెల్గాం, బీదర్, గుల్బర్గ (కలబురగి), రాయచూర్, యాద్గిర్.

తమిళనాడు: వేలూరు జిల్లా.

మధ్యప్రదేశ్: బుర్హాన్‌పూర్, ఖాండ్వా జిల్లాలు.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక ప్రక్రియ..

ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. 10వ తరగతి, ఐటీఐ మార్కుల సగటు (మెరిట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మార్కులు సమానంగా వస్తే, వయస్సులో పెద్దవారికి, అది కూడా సమానమైతే ముందుగా 10వ తరగతి పాస్ అయిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్​ రిక్రూట్​మెంట్​ 2026- స్టైపెండ్ అండ్​ శిక్షణ..

ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైపెండ్ చెల్లిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన డాక్టర్ జారీ చేసిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More