AP PGECET 2026 : ఏపీ పీజీఈసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ముఖ్యమైన తేదీలు
AP PGECET 2026 : ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGECET)-2026 దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. మార్చి 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGECET)-2026 దరఖాస్తుల దాఖలు గడువును మార్చి 20 వరకు పొడిగించినట్లు కన్వీనర్ పి.మల్లికార్జునరావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు గడువును పొడిగించినట్లు కన్వీనర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

అభ్యర్థులు మార్చి 23 వరకు రూ.1,000, మార్చి 26 వరకు రూ.2,000, మార్చి 28 వరకు రూ.4,000, ఏప్రిల్ 1 వరకు రూ.10,000 ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు ఏప్రిల్ 3న తమ ఫారమ్‌లలో తప్పులను సరిదిద్దుకోవడానికి అనుమతి ఉంటుంది. హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 15 నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు ఏప్రిల్ 28, 29 మరియు 30 తేదీల్లో జరగనున్నాయి.
మెుదట మార్చి 6తో ముగుస్తుండగా.. మార్చి 16 వరకు పొడిగించారు. తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు. పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్.డి(పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి.
ప్రవేశపరీక్షల సబ్జెక్ట్ లిస్ట్
బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, జియో ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫర్మాటిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలార్జికల్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, ఫార్మసీ.
ముఖ్యమైన తేదీలు..
- ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ జారీ
- ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు మార్చి 20 వరకు ఛాన్స్
- రూ.1000 నుంచి రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు ఏప్రిల్ 1 వరకు అవకాశం
- దరఖాస్తు సవరణ తేదీలు : ఏప్రిల్ 3
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం
- ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో
- ప్రాథమిక కీ విడుదల తేదీ: మే 6.
- ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: మే 8, 2026.
- ఫలితాలు విడుదల: మే 14, 2026.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


