Rail Parcel APP : ఫిబ్రవరి 25 నుంచి అందుబాటులోకి దక్షిణ మధ్య రైల్వే 'రైల్ పార్శిల్ యాప్‌'

ఫిబ్రవరి 25వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే 'రైల్ పార్శిల్ యాప్‌' అందుబాటులోకి రానుంది. డోర్ టూ డోర్ పార్శిల్ బుకింగ్, డెలివరీ సేవలను అందించనుంది.

Published on: Feb 24, 2026, 10:35:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పార్శిల్ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా డోర్ టు డోర్ పార్శిల్ బుకింగ్, డెలివరీని సజావుగా అందించడానికి దక్షిణ మధ్య రైల్వే(SCR) మొట్టమొదటిసారిగా రైల్ పార్శిల్ యాప్‌ను ప్రారంభించనుంది. ఈ యాప్‌ను ఫిబ్రవరి 25న సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఆడిటోరియంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రారంభించనున్నారు.

రైల్ పార్శిల్ యాప్‌
రైల్ పార్శిల్ యాప్‌

ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న భారత రైల్వేలలో హైదరాబాద్ డివిజన్ మొదటిది అవుతుంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫస్ట్ మైల్ (పికప్), మిడ్ మైల్ (రైలు రవాణా), లాస్ట్ మైల్(డెలివరీ)లను కనెక్ట్ చేస్తుంది. పార్శిల్ ట్రాకింగ్‌ను సులభతరం చేస్తుంది. వేగంగా, మరింత పారదర్శకంగా చేస్తుంది.

నెక్ట్స్ జనరేషన్ యాప్ బుకింగ్, ట్రాకింగ్, కన్సైన్‌మెంట్‌లను నిర్వహించడానికి వన్ స్టాప్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుంది. ఇది పరిశ్రమ, వ్యక్తులు, వ్యాపారాలు, లాజిస్టిక్స్ భాగస్వాములను ఒకే డిజిటల్ వ్యవస్థ కిందకు తీసుకురావడానికి రూపొందించారు. దక్షిణ మధ్య రైల్వే తన నెట్‌వర్క్ అంతటా సరుకు రవాణాను పెంచే లక్ష్యంతో సమగ్ర సరుకు రవాణా లాజిస్టిక్స్ మార్కెట్ అధ్యయనాన్ని నిర్వహించడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM) బెంగళూరుతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేస్తుంది.

మార్చి 1 నుంచి రైల్ వన్ యాప్

రైల్వే శాఖ అందించే అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు ‘రైల్‌వన్ యాప్‌’ను సిద్ధం చేసింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ యాప్ ప్రయాణికులను అందుబాటులోకి వస్తుంది. ప్రయాణికులు ఇకపై రైల్‌వన్ యాప్‌ను వినియోగించుకోవాలని రైల్వే శాఖ చెబుతోంది.

ఈ కొత్త యాప్‌ ద్వారా టికెట్‌ రిజర్వేషన్‌, అన్‌ రిజర్వ్‌డ్‌ , ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలు, పీఎన్‌ఆర్‌ ఎంక్వయిరీ, జర్నీ ప్లానింగ్‌, రైల్వే స్టేషన్లలో బోగీల పొజిషన్‌, రైలు ప్రయాణ స్థితి, రైలు సహాయ సేవలు, ప్రయాణ సమయంలో మీల్స్‌ బుకింగ్‌ వంటి పలు సేవలను ఒకే వేదిక ద్వారా పొందే వీలు ఉంటుంది. గతంలో పలు సేవలకు వేర్వేరు యాప్‌లు ఉండేవి. కానీ ప్రయాణికులకు ఒకే చోట ఈ సేవలన్నీ అందించాలనే ఉద్దేశ్యంతో... రైల్ వన్ యాప్‌ను సిద్ధం చేసింది.

ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ ఫోన్ యూజర్లు apps.apple.com/in/ నుంచి రైల్ వన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్‌ వన్‌లో ఒకే లాగిన్‌, ఒకే పాస్‌వర్డ్‌తో అన్ని సేవలను సులభంగా పొందే వీలుంటుంది. ఈ యాప్‌కు రైల్వే ఈ-వ్యాలెట్‌ను కూడా జోడిస్తారు. ‘సూపర్‌ యాప్‌’గా ఇది రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తుందని రైల్వేశాఖ చెబుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More