TGSWREIS Recruitment : గురుకులాల్లో 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే
TGSWREIS Recruitment 2026 : తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. తాత్కాలిక ప్రాతిపదికన ఐఐటీ-జేఈఈ, నీట్, సీఎంఏ, క్లాట్, యూపీఎస్సీ కోర్సుల బోధనకు నిపుణులైన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
TGSWREIS Recruitment 2026 : రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) పరిధిలోని ఫౌండేషన్, స్పోర్ట్స్, సీవోఈల్లో (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఐఐటీ, జేఈఈ, యూపీఎస్సీ, సీఎంఈ, క్లాట్ కోర్సులకు సంబంధించిన ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. తాత్కాలిక (గౌరవ వేతనం) ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హత, అనుభవం కలిగిన సబ్జెక్ట్ నిపుణుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

ఖాళీల వివరాలు…..
మొత్తం 117 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు సొసైటీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో రాష్ట్ర కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. గడువులోగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన అభ్యర్థులకు 2026 జూలై 12వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.
రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి, ఆయా సెంటర్ల వారీగా (ఫౌండేషన్, స్పోర్ట్స్, డిస్ట్రిక్ట్ COEs) విడిగా ఇంటర్వ్యూలు మరియు డెమోలకు పిలుస్తారు. డిస్ట్రిక్ట్ COEs మరియు ఫౌండేషన్/స్పోర్ట్స్ COEs ఎంచుకున్న అభ్యర్థులకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఉంటాయి.
ఎంపికైన ఫ్యాకల్టీ తమకు కేటాయించిన కాలేజీలలో ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి కళాశాలల జాబితాను సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
అప్లికేషన్ ప్రాసెస్….
అర్హత గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన అన్ని ధృువీకరణ పత్రాలతో కలిపి 'స్టేట్ ఆఫీస్, సరూర్ నగర్' చిరునామాలో స్వయంగా సమర్పించాలి. దరఖాస్తులను 2026 జూన్ 30లోపు సమర్పించాల్సి ఉంటుంది. సెలవు దినాల్లో కూడా దరఖాస్తులు స్వీకరించబడతాయి.
- రాష్ట్ర కార్యాలయ చిరునామా : ది స్టేట్ ఆఫీసర్, టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ (TGSWREI Society), హౌస్ నెం. 13-23-16, శ్రీరామ్‌నగర్, చైతన్యపురి మెట్రో స్టేషన్ ఎదురుగా, పిల్లర్ నంబర్: 1570 (నవతా ట్రాన్స్‌పోర్ట్ గల్లీ), సరూర్ నగర్ (మండలం), రంగారెడ్డి జిల్లా, పిన్ - 500060
- పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgswreis.telangana.gov.in/ ను చూడవచ్చు లేదా హెల్ప్‌లైన్ నంబర్ 040 2300 5100 ను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

