ఏఐపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ.. ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్

ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలల అధ్యాపకులకు ఏఐపై శిక్షణ ఉండనుంది. ఐదు రోజులు హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తారు.

Published on: Mar 1, 2026, 20:42:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలల అధ్యాపకుల కోసం మార్చి 2 నుండి 'డిసిప్లేన్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఆప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)' అనే అంశంపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(FDP)ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(APSCHE) నిర్వహిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ కార్యక్రమం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లోని ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సెల్‌లో జరుగుతుంది. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(RUSA) ఆర్థిక సహాయంతో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ సహకారంతో ఎఫ్‌డీపీని నిర్వహిస్తున్నారు.

APSCHE విడుదల చేసిన ప్రకటనలో NEP-2020, విక్షిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా, విభిన్న విద్యా విభాగాలలోని అధ్యాపకులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌పై శిక్షణ ఇస్తారు. స్పష్టత, ఆచరణాత్మక అవగాహనను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఇంటెన్సివ్ శిక్షణా కార్యక్రమం ఉపాధ్యాయులను డిసిప్లేన్-స్పెసిఫిక్, నో-కోడ్, లో-కోడ్ ఏఐ అప్లికేషన్లతో సన్నద్ధం చేయడానికి రూపొందించారు. బోధన, పరిశోధన, పాఠ్యాంశాల పంపిణీలో ఏఐ సాధనాలు, డేటా-ఆధారిత విధానాలను ఏకీకృతం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వాణిజ్యం, నిర్వహణ, లైఫ్ సైన్సెస్, భౌతిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవీయ శాస్త్రాలు, కంప్యూటర్ సైన్స్‌తోపాటుగా మరికొన్నింటిని కవర్ చేస్తుంది.

ఈ ప్రోగ్రామ్‌‌లో భాగంగా థియరీ సెషన్‌లు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్ కార్యకలాపాలు, కేస్ స్టడీస్, మరికొన్ని టూల్స్ ఉన్నాయి. ఏఐ ఎకో సిస్టమ్, ప్లాట్‌ఫారమ్‌లు, ఎడ్జ్ ఏఐ, డేటా రకాలు, రిపోజిటరీలు, ఎథిక్స్ మరియు బాధ్యతాయుతమైన AI వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది. వీటితోపాటుగా చాలా విషయాల్లో శిక్షణ ఉంటుంది.

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలల అధ్యాపకులకు అత్యాధునిక ఏఐ సాధనాలు, రియల్-వరల్డ్ అప్లికేషన్స్, సైన్స్, టెక్నాలజీ, బోధనా శాస్త్రాలను అనుసంధానించే ఇంటర్ డిసిప్లినరీలాంటి అంశాలను కవర్ చేస్తారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సుమారు 200 మంది అధ్యాపకులకు శిక్షణ ఇస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More