ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి పంపిణీ చేసే సన్నబియ్యాన్ని అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవని, అలాంటి వారి రేషన్ కార్డులను తక్షణమే రద్దు చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుటాని తండాలో నిర్వహించిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు ద్వారా వచ్చే బియ్యాన్ని్ అమ్ముకునేవారిని హెచ్చరించారు. ఈ బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తామన్నారు.

గుడిసెల్లో జీవించే అర్హులైన పేదలందరికీ వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, పేదరికామే ప్రామాణికమని స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేయడంలో విఫలమైతే, బాధ్యత వహించని సర్పంచ్‌ల పదవులు పోతాయని తేల్చిచెప్పారు.
వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షాలు తగ్గే అవకాశం ఉందని, తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడవచ్చునని తుమ్మల హెచ్చరించారు. తీవ్రమైన నీటి ఎద్దడిని కూడా తట్టుకుని పెరిగే పంట ఆయిల్ పామ్ అని, కాబట్టి రైతులు పామాయిల్ సాగువైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఈ పంట వేసే రైతులకు అవసరమైన సబ్సిడీలు, రాయితీలు ప్రభుత్వం తరఫున ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
రఘునాథపాలెం మండలానికి సాగునీటిని విడుదల చేస్తున్నామని, పొలాలకు నీళ్లు పారించుకోవచ్చని సూచించారు. ఆర్‌వీఎఫ్‌ఆర్ పట్టాలు కలిగిన గిరిజన, గిరిజనేతర రైతులకు విద్యుత్ బోర్ల అనుమతులు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని మాట ఇచ్చారు.
పొలాలకు వెళ్లేందుకు వీలుగా రూ. 75 కోట్ల వ్యయంతో దాదాపు 200 డొంక రోడ్లను, గ్రామీణ లింక్ రోడ్లను నిర్మిస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించడానికి ప్రాంతంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
{{/usCountry}}పొలాలకు వెళ్లేందుకు వీలుగా రూ. 75 కోట్ల వ్యయంతో దాదాపు 200 డొంక రోడ్లను, గ్రామీణ లింక్ రోడ్లను నిర్మిస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించడానికి ప్రాంతంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
{{/usCountry}}'ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో సర్కారీ బడులను నిర్వహిస్తుంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపడం సరైన పద్ధతి కాదు. విద్య ద్వారానే పేద కుటుంబాల బతుకులు మారతాయి.' అని మంత్రి తుమ్మల హితవు పలికారు.
పేదలకు అందాల్సిన బియ్యం రీసైక్లింగ్‌కు గురవుతుండడం, పక్కదారి పట్టడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. సంక్షేమ ఫలాలు కేవలం అర్హులైన పేదలకు మాత్రమే చేరాలనేది ప్రభుత్వ స్పష్టమైన విధానమని, ఉచిత లేదా సబ్సిడీ బియ్యాన్ని వ్యాపారులకు అమ్మే లబ్ధిదారుల వివరాలను సేకరించి, వారి ప్రాథమిక హక్కులైన రేషన్ కార్డులను సైతం రద్దు చేస్తామని గట్టిగా హెచ్చరిక జారీ చేశారు.