వెలుగుమట్ల నిర్వాసితులకు స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు - ఈనెల 15లోపు పట్టాలు

ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీలోపు పట్టాలిచ్చేందుకు సిద్ధమైంది. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి వెల్లడించారు. 

Published on: Mar 2, 2026, 06:27:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఖమ్మంలోని వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులకు ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారికి ఈనెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాలు కేటాయించనుంది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరాలను ప్రకటించారు.

వెలుగుమట్ల నిర్వాసితులకు స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు
వెలుగుమట్ల నిర్వాసితులకు స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు

ఆదివారం ఖమ్మం ఐడిఒసి వేదికగా వెలుగుమట్ల బాధితులతో మంత్రి పొంగులేటి ముఖాముఖిగా మాట్లాడారు. వెలుగుమట్ల భూముల విషయంలో పనిగట్టుకుని ఒకే కోణంలోనే కొన్ని పత్రికలు, ఛానల్స్ వార్తకథనాలను ప్రసారం చేశాయని... తప్ప నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. వాస్తవానికి ​వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, అప్పుల పాలై నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతను గ్రహించలేదని వ్యాఖ్యానించారు.

చాలా మంది పేదవాళ్లు రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించారని మంత్రి పొంగులేటి చెప్పారు. పట్టాలొస్తాయని నమ్మబలికి పేదలకు ఆశ చూపెట్టి దానినే ఆసరా చేసకుని నట్టేట ముంచారన్నారు. పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా కొందరు 4నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో వారంతా రోడ్డున పడ్డారన్నారు.

ఈనెల 15లోపు పట్టాలు - మంత్రి పొంగులేటి

బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి భరసానిచ్చారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ, పాఠశాలలను వంటి మౌళిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. నియోజకవర్గాల వారిగా బాధితులను గుర్తించి... వారి వారి ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తామని తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More