...
...
Next Story

హైదరాబాద్ : KPHBలో గజం రూ. 2.65 లక్షలు - బహిరంగ వేలంలో రికార్డు ధరలు…!

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ( కేపీహెచ్‌బీ )లో ఉన్న భూములకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. ఇందులో ఒక్క ప్లాట్‌లో గజం ధర ఏకంగా రూ.2.65 లక్షలు పలకింది. ఈ వేలం ద్వారా ఏకంగా రూ.24.26 కోట్ల ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరింది.

Published on: Feb 27, 2026, 22:27:32 IST
Advertisement

హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్ ఉన్న కెపిహెచ్ బి ప్రాంతంలోని ప్లాట్లు, ఫ్లాట్ల ను బహిరంగం వేలంలో రికార్డు ధరలకు కొనుగోలు చేశారు.

గజం రూ.2.65 లక్షలు…

భూముల వేలం - భారీగా ఆదాయం (ఫైల్ ఫొటో)
భూముల వేలం - భారీగా ఆదాయం (ఫైల్ ఫొటో)

ఫేజ్-1 మరియు 2 లోని ధర్మారెడ్డి కాలనీ లోని 4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ -15 లోని సంపూర్ణం అపార్ట్ మెంట్ లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం నాడు బహిరంగ వేలం నిర్వహించారు. మొత్తం 40 మంది కొనుగోలు దారులు పాల్గొన్న ఈ వేలం పాటలో ఎల్ ఐజి కేటగిరీకి చెందిన ప్లాట్ చదరపు గజం కనీస ధర రూ. 1.30 లక్షలుగా నిర్దారించగా…. చదరపు గజం రూ.2.65 లక్షలకు అమ్ముడు పోయింది.

మరో ప్లాట్ ను చదరపు గజం రూ.2.41 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోడానికి బిడ్డర్లు (కొనుగోలుదారులు) పోటీ పడ్డారు.

అదే విధంగా సంపూర్ణం అపార్ట్ మెంట్ లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు (Flats) రూ .90 లక్షలను అప్ సెట్ ధరగా నిర్దారించగా….. వీటిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడి గరిష్టంగా రూ.1.10 కోట్లు, అలాగే ఇతర ఫ్లాట్లను రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ. 1.06 కోట్లకు కొనుగోలు చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks