...
...
Next Story

Jewellery Robbery Case : కరీంనగర్ జ్యువెలరీ కేసులో పురోగతి - ముగ్గురు నిందితులు అరెస్ట్..! పరారీలోనే గ్యాంగ్ లీడర్

Karimnagar PMJ Jewellery Robbery Case : కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారు నగలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Published on: May 14, 2026 12:01 PM IST
Advertisement

Karimnagar PMJ Jewellery Robbery Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూం దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మే 3వ తేదీన పట్టపగలే తుపాకులతో హల్‌చల్ చేసి…. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లిన అంతరాష్ట్ర ముఠాలోని పలువురిని అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని…. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొంతమేర బంగారు ఆభరణాలు, పిస్టల్స్, పరారీకి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు.

కరీంనగర్ జ్యువెలరీ కేసులో పురోగతి
కరీంనగర్ జ్యువెలరీ కేసులో పురోగతి

షోరూంలో దోపిడీ అనంతరం దొంగలు తమ బైకులపై మహారాష్ట్ర మీదుగా పశ్చిమ బెంగాల్‌కు పారిపోయినట్లు విచారణలో తేలింది. సుమారు 1.6 కేజీల బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకున్న ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజీని ఆధారంగా చేసుకుని వేట ప్రారంభించారు. నిందితులు ధర్మపురి వద్ద బైకును వదిలివేసి…. అంతర్గత రహదారుల గుండా తప్పించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన పోలీసు బృందాలు నిందితులను బెంగాల్, బీహార్లలో గుర్తించి అరెస్ట్ చేశారు.

ఈ కేసు వివరాలను కరీంనగర్‌ పోలీస్ కమిషనర్ గౌష్ అలం వెల్లడించారు. ఈ దోపిడీ కేసులో మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారని తెలిపారు. దోపిడీకి ముందు నిందితులు రెక్కీ నిర్వహించారని వివరించారు. ధర్మపురిలో ఆశ్రయం పొందారని… చోరీ తర్వాత 3 బృందాలుగా విడిపోయి పరారయ్యారని పేర్కొన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. రెండు నెలల క్రితమే నాలుగు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి.. చివరికి కరీంనగర్‌లో దోపిడీ చేశారని తెలిపారు.

మాస్టర్ మైండ్ సుబోద్ సింగ్…!

ఈ భారీ దోపిడీ వెనుక బీహార్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 'గోల్డెన్ థీఫ్'గా పేరుగాంచిన సుబోద్ సింగ్ మాస్టర్ మైండ్‌గా ఉన్నాడని పోలీసులు నిర్ధారించారు. కరీంనగర్ దోపిడీకి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా నిందితులను ఎంపిక చేసి… వారికి శిక్షణ ఇచ్చి ఈ స్కెచ్ అమలు చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe