...
...
Next Story

Cylinder Blast : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం - గ్యాస్ సిలిండర్ పేలి నానమ్మ, ఇద్దరు మనవళ్లు సజీవ దహనం..!

Nalgonda Cylinder Blast : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నిద్రిస్తున్న నానమ్మతో పాటు ఆమె ఇద్దరు మనవళ్లు సజీవదహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Jun 5, 2026, 12:43:50 IST
Advertisement

Nalgonda Cylinder Blast : నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ వృద్ధురాలితో పాటు ఆమె ఇద్దరు మైనర్ మనవళ్లు ఉన్నారు.

ముగ్గురు సజీవదహనం…

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి (representative image )
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి (representative image )

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని ఒక చిన్న రెండు గదుల ఇంట్లో చంద్రమ్మ (50) అనే మహిళ తన మనవడు లక్ష్మణ్ (17), మనవరాలు ప్రణతి (14)లతో కలిసి నివసిస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత…. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోని వంటగ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది.

అర్ధరాత్రి వేళ ప్రమాదం జరగడం…. ఇల్లు చిన్నది కావడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. నిద్రలోనే మంటల మధ్య చిక్కుకుపోవడంతో ముగ్గురూ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. తీవ్రమైన అగ్నికీలలకు చంద్రమ్మ, లక్ష్మణ్, ప్రణతి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

పిల్లల తండ్రి గతంలోనే మరణించగా…. తల్లి ఉపాధి వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వలస వెళ్ళింది. అప్పటి నుంచి నానమ్మ చంద్రమ్మే ఆ ఇద్దరు పిల్లలను చేరదీసి సాకుతోంది. ఇంతలోనే కాలం రూపంలో వచ్చిన ప్రమాదం ఆ ముగ్గురిని బలితీసుకుంది.

గ్యాస్ సిలిండర్ పేలడానికి గల ఖచ్చితమైన కారణాలు వెంటనే తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగిందా..? లేదా షార్ట్ సర్క్యూట్ కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe