టామ్‌కామ్ నుంచి ఉద్యోగ ప్రకటన.. రూ. 95,000 వరకు జీతంతో జాబ్స్

విదేశాల్లో స్థిరపడాలనుకునే నర్సింగ్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(TOMCOM) ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published on: Oct 19, 2026, 17:43:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖకు చెందిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ఖతార్‌లో అర్హత కలిగిన నర్సింగ్ నిపుణులకు ఉపాధి అవకాశాలను ప్రకటించింది. హోమ్ కేర్ సేవలలో రోగులకు వృత్తిపరమైన సంరక్షణను అందించడానికి లైసెన్స్డ్ ప్రాక్టీషనర్ నర్సులు(LPN), నర్స్ టెక్నీషియన్ల పోస్టుల కోసం అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల కోసం టామ్‌కామ్ చూస్తోంది.

టామ్‌కామ్ ఉద్యోగాలు
టామ్‌కామ్ ఉద్యోగాలు

20 నుండి 40 సంవత్సరాల వయస్సు గల సంబంధిత క్లినికల్ నైపుణ్యాలు, చక్కటి ఆంగ్ల సంభాషణ సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పదవికి నర్స్ టెక్నీషియన్‌లకు కనీసం ఒక సంవత్సరం అనుభవం, లైసెన్స్ పొందిన ప్రాక్టీషనర్‌లకు కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు అర్హత, అనుభవాన్ని బట్టి ఆకర్షణీయమైన జీతాలను చెల్లించనున్నారు. అభ్యర్థులకు ఆకర్షణీయమైన నెలవారీ జీతాలు లభిస్తాయి. ఇందులో నర్స్ టెక్నీషియన్లకు రూ. 73,000, లైసెన్స్ పొందిన ప్రాక్టీషనర్ నర్సులకు రూ. 95,000 జీతం ఇస్తారు.

అభ్యర్థుల విద్యార్హతలు, సంబంధిత పని అనుభవం, క్లినికల్ నైపుణ్యాలు, ఆంగ్ల భాషలో సంభాషించే సామర్థ్యం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడం కోసం ఎలాంటి ప్రోమెట్రిక్ పరీక్ష అవసరం లేదు.

ఎంపికైన అభ్యర్థులకు ఉపాధి వీసా, విమాన టిక్కెట్లు, నిర్దేశిత పికప్, డ్రాప్-ఆఫ్ పాయింట్లకు రాకపోకల రవాణా, వసతి, ప్రాథమిక వైద్య బీమాతో సహా అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయని టామ్‌కామ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు TOMCOMను నేరుగా 08035524946 నంబర్‌లో సంప్రదించవచ్చు. లేదంటే సీవీలను tomcomglobal@gmail.comకు ఇమెయిల్ ద్వారా పంపవచ్చు.

హోమ్‌కేర్ విభాగంలో రోగులకు సంరక్షణ అందించేందుకు అర్హత, ఆసక్తి ఉన్న నర్సింగ్ నిపుణులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More