...
...
Next Story

హైదరాబాద్ గచ్చిబౌలి రూట్‌లో జూలై 1 నుంచి 90 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ఈ ఆంక్షలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి.

Published on: Jun 29, 2026, 21:03:50 IST
Advertisement

ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. గచ్చిబౌలి పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్టీ-లెవెల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనుల కారణంగా డీఎల్‌ఎఫ్ గేట్ నంబర్ 1 నుండి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్డును రాబోయే మూడు నెలల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నూతన ఆంక్షలు జులై 1 నుండి అమలులోకి రానున్నాయి.

గచ్చిబౌలి ట్రాఫిక్ మళ్లింపులు
గచ్చిబౌలి ట్రాఫిక్ మళ్లింపులు

ఈ నిర్మాణ పనులు కనీసం ఏడాది పాటు సాగే అవకాశం ఉన్నందున, ఐఐఐటీ (IIIT) జంక్షన్ పరిసర ప్రాంతాలలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణికులు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

కొత్త ట్రాఫిక్ డైవర్షన్లు ఇవే

రాడిసన్ హోటల్ వైపు నుంచి వచ్చే వాహనాలను డీఎల్‌ఎఫ్ గేట్ నంబర్ 1 వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మూసివేసి ఉంటుంది. వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వరకు వెళ్లి, అక్కడ ఇందిరానగర్ వైపు కుడి మలుపు తీసుకుని ఐఐఐటీ జంక్షన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

TCS నాన్-సెజ్ (Non-SEZ/CMC) గేట్ ఉపయోగించే ఉద్యోగులు ఎప్పటిలాగే తమ రెగ్యులర్ గేట్ ద్వారానే లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి అనుమతి ఉంటుంది.

లింగంపల్లి వైపు నుంచి డీఎల్‌ఎఫ్ రోడ్డు ద్వారా వచ్చే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద దారి మళ్లిస్తారు. ఈ వాహనాలు ఐఐఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవాలి. అక్కడ ఎడమ మలుపు తీసుకుని రాడిసన్ జంక్షన్ మీదుగా డీఎల్‌ఎఫ్‌కు చేరుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks