...
...
Next Story

తెలంగాణలో ఘోరం.. ఇంటికి పిలుచుకుని 8 ఏళ్ల బాలికపై బంధువుల అత్యాచారం!

తెలంగాణలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికపై బంధువులు అత్యాచారం చేశారు. తల్లిదండ్రులతో బాలిక చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Published on: Feb 9, 2026, 20:11:00 IST
Advertisement

లైంగిక వేధింపుల చేసేవారిపై కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. చాలా మందిలో మార్పు కనిపించడం లేదు. చిన్నారులపై కూడా దారుణాలు పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు అభంశుభం తెలియని పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో 8 ఏళ్ల బాలికపై బంధువులు అత్యాచారం చేశారు. బాలిక ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

బాలికపై అత్యాచారం
బాలికపై అత్యాచారం

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ఆమె బంధువులు ఇద్దరు అత్యాచారం చేశారు. అందులో ఒకరు మైనర్ అని కూడా పోలీసులు తెలిపారు. ఈ అఘాయిత్యాలు వేర్వేరు సమయాల్లో జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ దారుణాలు ఒకటి గత వారం జరగ్గా.. మరొకటి ఆదివారం జరిగింది.

ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. నిందితులలో ఒకరు 21 ఏళ్ల వ్యక్తి. బాలికకు వరుసకు మామ అవుతాడు. ఆదివారం ఆమె తల్లిదండ్రులు పొలాల్లో పనికి వెళ్లారు. ఇదే సమయంలో బాలికను మామ వరుసయ్యే పొరుగున ఉన్న వ్యక్తి ఇంటికి తీసుకెళ్లాడు. బాలికకు మాయమాటలు చెప్పాడు. తన నివాసంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఆ బాలిక బాధతో ఇంటికి తిరిగి వచ్చింది. బాగా ఏడ్చింది. ఆమె తల్లిదండ్రులు ఏడుపు చూసి.. ఏం జరిగిందని అడిగారు. తనపై మామ వరుస అయ్యే వ్యక్తి చేసిన లైంగిక దాడిని తెలిపింది. కొన్ని రోజుల క్రితం 16 ఏళ్ల వయసున్న బాలుడు తమ ఇంట్లో కూడా ఇలానే చేశాడని బాలిక తల్లిదండ్రులకు వివరించింది. అతడు కూడా బాలికకు బంధువే అవుతాడు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe