ఇవాళ పెళ్లి రోజునే తల్లిదండ్రులు అయిన హీరో హీరోయిన్- నాలుగేళ్లకు తొలి సంతానం- సంతోషంలో రాజ్ కుమార్ రావు, పత్రలేఖ
బాలీవుడ్ సెలబ్రిటీ జంట రాజ్ కుమార్ రావు, పత్రలేఖ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వివాహం అయిన నాలుగేళ్లకు వారి తొలి సంతానాన్ని ఆహ్వానించారు. అయితే, తమ నాలుగో పెళ్లి రోజునే కుమార్తె పుట్టినట్లు చెబుతూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ జంట రాజ్ కుమార్ రావు, పత్రలేఖ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వివాహం జరిగిన నాలుగేళ్లకు వారు తమ తొలి సంతానాన్ని ఆహ్వానించారు. అది కూడా వారి పెళ్లిరోజునే తొలి బిడ్డకు జన్మనివ్వడం వారి జీవితంలో అత్యంత మధురమైన రోజుగా నిలిచిపోయింది.

నాలుగో వివాహ వార్షికోత్సవం
ఇవాళ (నవంబర్ 15) తమకు బేబీ గర్ల్ పుట్టినట్లు ప్రకటించారు రాజ్ కుమార్ రావు, పత్రలేఖ. దీంతో రాజ్ కుమార్, పత్రలేఖ జంట నాలుగో వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ కుటుంబంలోకి ఒక ఆడపిల్లను స్వాగతిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సెలబ్రిటీ జంట తమ అపారమైన ఆనందాన్ని, కృతజ్ఞతలను వ్యక్తం చేస్తూ హృదయపూర్వక వార్తను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పెళ్లి రోజునే తమకు కూతురు పుట్టడంతో హీరో హీరోయిన్ల ఆనందం మరింత రెట్టింపుగా మారింది.
ఆడపిల్లను ప్రసాదించాడు
శనివారం నాడు రాజ్ కుమార్, పత్రలేఖ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు కలిసి పోస్ట్ పెట్టారు. అందులో తమకు కూతురు పుట్టినట్లు అధికారింగా తెలియజేశారు. ఈ పోస్ట్‌లో "మేము చంద్రుడిపై ఉన్నాము. దేవుడు మాకు ఒక ఆడపిల్లను ప్రసాదించి ఆశీర్వదించాడు. తల్లిదండ్రులు అయిన పత్రలేఖ అండ్ రాజ్ కుమార్ రావు" అని రాసుకొచ్చారు.
అలాగే, "మా 4వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం" అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చారు హీరో హీరోయిన్ రాజ్ కుమార్ రావు, పత్రలేఖ. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సెలబ్రిటీల నుంచి నెటిజన్స్, అభిమానుల వరకు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బేబీ ఆన్ ది వే
కాగా, ఈ ఏడాది జూలైలో పత్రలేఖ ఇన్‌స్టాగ్రామ్‌లో తన గర్భధారణ విషయాన్ని ప్రకటించారు. వారు ఒక చిత్రాన్ని పంచుకున్నారు. దానిపై "బేబీ ఆన్ ది వే" అని రాశారు. ఇక ఇదిలా ఉంటే, రాజ్ కుమార్ రావు, పత్రలేఖ 2021 సంవత్సరంలో నవంబర్ 15న అంటే ఇవాళ వివాహం చండిగఢ్‌లో చేసుకున్నారు.
పదకొండేళ్ల ప్రేమాయణం, డేటింగ్ తర్వాత ఈ హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నాలుగేళ్లకు తమ తొలి సంతానంగా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఇకపోతే రాజ్ కుమార్ రావు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
రాజ్ కుమార్ రావు, పత్రలేఖ సినిమాలు
రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన స్త్రీ, స్త్రీ 2 హారర్ కామెడీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇక పత్రలేఖ సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చి సిటీ లైట్స్ మూవీలో హీరోయిన్‌గా చేసింది. అందులో హీరోగా రాజ్ కుమార్ రావు చేశాడు.
ఫులే, లవ్ గేమ్స్, బద్నామ్ గలి, వైల్డ్ వైల్డ్ పంజాబ్, నాను కి జాను వంటి సినిమాల్లో పత్రలేఖ పాల్ నటించి మెప్పించింది. అలాగే రాజ్ కుమార్ రావు మాలిక్, భూల్ చుక్ మాఫ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, షాదీ మే జరూర్ ఆనా, శ్రీకాంత్, హిట్ ది ఫస్ట్ కేస్ వంటి ఎన్నో హిందీ చిత్రాలతో మెప్పించాడు
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


