Trainee IPS Uday Krishna Reddy : హైదరాబాద్ లో శిక్షణలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కృష్ణారెడ్డికి చికిత్స అందిస్తున్నారు. నిన్న(ఆదివారం) కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బలవన్మరణానికి పాల్పడటంతో ఆయన్ను తక్షణమే చికిత్స నిమిత్తం ఎస్సార్ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది.
అసలేం జరిగింది..?
నిన్ననే (ఆదివారం) ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఒక వేధింపుల కేసు నమోదైంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఆయనపై ఈ ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధించడమే కాకుండా… ఒక గదిలో బంధించి తనపై దాడికి కూడా పాల్పడ్డాడని సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు నమోదు కావడం, అది కాస్తా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
“నా తప్పు లేదు”….
ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టే ముందు ఉదయ్ కృష్ణారెడ్డి తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో "తన తప్పు ఏమీ లేదు" అని పేర్కొన్నట్లు తెలిసింది. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. న్యాయం గెలుస్తుందని ఈ పోస్టులో పేర్కొన్నాడు.
బాధితురాలు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణ రెడ్డిపై లైంగిక వేధింపులు, శారీరక దాడి, క్రిమినల్ బెదిరింపులు, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ దశలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతో… దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణా సంస్థలో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి జర్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువు కొనసాగించాడు. 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అయితే ఓ సీఐ తోటివారి ముందు అవమానించడంతో…. 2018లో ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్స్ సాధించటమే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. పలుమార్లు ఫెయిల్ అయినప్పటికీ…. ఐదోసారి 360 ర్యాంకుతో ఐపీఎస్ సాధించాడు. త్వరలో పూర్తి స్థాయి పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన అతను…. ఇప్పుడు ఇలా ఆరోపణలతో ఆత్మహత్యాయత్నం వరకు వచ్చాడు. అయితే ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటికి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
{{/usCountry}}ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి జర్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువు కొనసాగించాడు. 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అయితే ఓ సీఐ తోటివారి ముందు అవమానించడంతో…. 2018లో ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్స్ సాధించటమే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. పలుమార్లు ఫెయిల్ అయినప్పటికీ…. ఐదోసారి 360 ర్యాంకుతో ఐపీఎస్ సాధించాడు. త్వరలో పూర్తి స్థాయి పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన అతను…. ఇప్పుడు ఇలా ఆరోపణలతో ఆత్మహత్యాయత్నం వరకు వచ్చాడు. అయితే ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటికి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
{{/usCountry}}