...
...
Next Story

Telangana : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సరికొత్త చరిత్ర - చిట్యాలలో 'ట్రాన్స్‌జెండర్' విక్టరీ

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ విక్టరీ కొట్టారు.

Published on: Feb 13, 2026 12:35 PM IST
Advertisement

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్ అభ్యర్థి విక్టరీ కొట్టారు. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నాగిళ్ల కావేరి సుధాకర్(ట్రాన్స్ జెండర్) విజయం సాధించారు.

నాగిళ్ల కావేరి సుధాకర్(ట్రాన్స్ జెండర్)
నాగిళ్ల కావేరి సుధాకర్(ట్రాన్స్ జెండర్)

ఈ వార్డులో కాంగ్రెస్ మద్దతుతో సీపీయం అభ్యర్థిగా నగేశ్‌ పోటీ చేశారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసిన నాగిళ్ల కావేరి సుధాకర్ 109 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మరోవైపు చిట్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. కాంగ్రెస్ 9 వార్డులు, బీఆర్ఎస్ 2 వార్డులను కైవసం చేసుకోగా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాగిళ్ల కావేరి సుధాకర్ విజయం సాధించారు.

విజేతలు:

1వ వార్డు: నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్‌జెండర్ ఇండిపెండెంట్ అభ్యర్థి)

2వ వార్డు: BRS - అజిమ్.

3వ వార్డు: కాంగ్రెస్ - గాలి యాదమ్మ లింగయ్య.

4వ వార్డు: కాంగ్రెస్ - కోనేటి ఎల్లయ్య.

5వ వార్డు: కాంగ్రెస్ - గుండెబోయిన శ్రీలక్ష్మీసైదులు.

6వ వార్డు: కాంగ్రెస్ - జెరిపోతుల సత్యనారాయణ.

7వ వార్డు: కాంగ్రెస్ - దేశపాక రాజేశ్ లతా.

9వ వార్డు: కాంగ్రెస్ - ఏర్పుల పరమేశ్.

10వ వార్డు: BRS - నిమ్మనగోటి శ్రీను.

11వ వార్డు: కాంగ్రెస్ - బొబ్బల రాంరెడ్డి.

12వ వార్డు: కాంగ్రెస్ - పందిరి గీతా రమేశ్.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe