Telangana Auto Fares : తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు - కొత్త రేట్లు ఇవే..!

తెలంగాణలో ఆటో రిక్షా ఛార్జీలను సవరిస్తూ రవాణా శాఖ జీవో జారీ చేసింది. కనీస ఛార్జీ రూ.30గా నిర్ణయించగా… రాత్రి వేళల్లో ఒకటిన్నర రెట్లు అదనంగా వసూలు చేయనున్నారు.

Published on: Oct 2, 2026, 19:00:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంచుతూ రవాణాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో కనీస ఛార్జీ 1.6 కి.మీ వరకు రూ.30, కనీస ఛార్జీ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14గా నిర్ణయించారు.

ఆటో ఛార్జీలు పెంపు
ఆటో ఛార్జీలు పెంపు

ప్రయాణికుల అవసరాలు, ఇంధన ధరల పెంపును పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త ధరలను ఖరారు చేశారు. వివిధ జీవోల అనుభవాలు, రవాణా శాఖ కమిషనర్ సమర్పించిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2014 తర్వాత సుదీర్ఘ కాలం పిమ్మట ఆటో ఛార్జీలను మళ్లీ అధికారికంగా పెంచుతూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు ఇచ్చింది.

కొత్త ఆటో ఛార్జీల పూర్తి వివరాలు:

సవరించిన పట్టిక ప్రకారం నూతన రేట్లు ఈ క్రింది విధంగా అమలులోకి వస్తాయి. కనీస ఛార్జీ మొదటి 1.6 కిలోమీటర్ల వరకు కనీస ప్రయాణ ఛార్జీని రూ. 30 గా నిర్ణయించారు.

  • అదనపు కిలోమీటరు ఛార్జీ : 1.6 కిలోమీటర్లు దాటిన తర్వాత సాగే ప్రయాణానికి ప్రతి కిలోమీటరుకు రూ. 14 చొప్పున వసూలు చేస్తారు.
  • వెయిటింగ్ ఛార్జీలు : ప్రయాణంలో నిరీక్షణ సమయానికి (వెయిటింగ్) నిమిషానికి 75 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.
  • రాత్రి వేళ ప్రయాణ ఛార్జీలు : రాత్రి 11:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల మధ్య ప్రయాణించే ఆటోలకు సాధారణ ఛార్జీపై అదనంగా ఒకటిన్నర రెట్లు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చారు.

ఆటోల్లో ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీపై కూడా రవాణా శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్…. లేదా 60x40 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణం ఉండే చిన్న బ్యాగులకు ఎలాంటి లగేజీ ఛార్జీలు ఉండవు. వీటిని మినహాయించి అదనంగా ఉండే ప్రతీ లగేజీ ప్యాకేజీకి ప్రయాణమంతటికీ కలిపి 50 పైసలు వసూలు చేస్తారు. ఒక ఆటోలో ప్రయాణికులు తమతో పాటు గరిష్టంగా 100 కిలోగ్రాముల వరకు మాత్రమే లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

ఆటోల్లో ఉండే డిజిటల్ మీటర్లను నూతన రేట్లకు అనుగుణంగా మార్చడానికి రవాణా శాఖ ఆటో డ్రైవర్లు మరియు యజమానులకు సమయం ఇచ్చింది. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 3 నెలల వ్యవధిలో డిజిటల్ మీటర్లను కొత్త టారిఫ్‌కు అనుగుణంగా రీసెట్ చేసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ స్పష్టం చేశారు.

ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ఆమోదించిన కొత్త టారిఫ్ కార్డును ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా ఆటోలో ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. మీటర్‌‌లో తొలి 1.6 కిలోమీటర్లకు రూ. 30 నమోదు అయ్యేలా… ఆ తర్వాత ప్రతీ 100 మీటర్లకు రూ. 1.40 చొప్పున పెరిగేలా డిజిటల్ మీటర్ల మైక్రోచిప్‌లను రీసెట్ చేయాల్సి ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More