తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్ వచ్చేది ఎప్పుడంటే?

TG inter results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. అందరూ ఇంటర్ రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Published on: Apr 08, 2026 7:57 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విద్యార్థులు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 ఏప్రిల్‌లోనే విడుదల కానున్నాయి. నిజానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ మెుదటి, రెండో సంవత్సరం 2026 ఫలితాలు వాయిదా పడ్డాయి. ఫలితాల విడుదల తేదీగా ఏప్రిల్ 12వ తేదీని విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఇప్పుడు ఫలితాలు ఆలస్యమయ్యాయి. అధికారికంగా బోర్డు ఏప్రిల్ 12వ తేదీ అని చెప్పలేదు. కానీ ఆ తేదీన ఫలితాలు వెల్లడించడం లేదని పేర్కొంది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026

తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఈ సంవత్సరం స్వల్ప జాప్యాన్ని ఎదుర్కోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా బోర్డు ప్రకారం, ఫలితాలు కచ్చితంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం, బోర్డు అదనపు చర్యలు తీసుకుంటున్నాయి.

కొంతమంది విద్యార్థులు కొన్ని సబ్జెక్టులలో కేవలం 2-3 మార్కుల తేడాతో ఫెయిల్ అయినట్లు సమాచారం. ఈ కేసులను ఎలా పరిష్కరించాలనే దానిపై అధికారుల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే తుది ఫలితాల తేదీని ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన సమయంలో పొరపాట్లు లేదా సాంకేతిక సమస్యలను నివారించడానికి బోర్డు చర్యలు తీసుకుంటుంది.

దాదాపు స్పాట్ వాల్యూయేషన్ పూర్తయింది. ఇక సాంకేతిక సమస్యలు సరిచేసుకుని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ మూడు లేదంటే నాలుగో వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 రానున్నాయి.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు 2026 ఫిబ్రవరి 25 నుండి మార్చి 17 వరకు జరగ్గా, రెండో సంవత్సరం పరీక్షలు 2026 ఫిబ్రవరి 26 నుండి మార్చి 18 వరకు జరిగాయి. జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 4న ప్రారంభమై ప్రస్తుతం తుది దశలో ఉంది.

ఈ సంవత్సరం పరీక్షలకు దాదాపు 9,97,075 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా బోర్డు అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో తమ ఫలితాలను పొందవచ్చు. లాగిన్ అవ్వడానికి హాల్ టిక్కెట్లపై ఉన్న రోల్ నంబర్ అవసరం కాబట్టి, వాటిని అందుబాటులో ఉంచుకోవడం ముఖ్యం.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

  • తెలంగాణ ఇంటర్ రిజల్స్ట్ కోసం అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.inకు వెళ్లండి.
  • హోమ్ పేజ్‌ను ఓపెన్ చేసి రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ బటన్‌ మీద క్లిక్ చేయండి.
  • అనంతరం తెలంగాణ ఇంటర్ ఫలితాలు మీ స్క్రీన్‌ మీద డిస్‌ప్లే అవుతాయి.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More