తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి ఫలితాల సరళి గత నాలుగేళ్లతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడటం విశేషం. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా బాలికలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
గ్రూపుల వారీగా ఉత్తీర్ణత ఇలా..

ఈ ఏడాది కూడా సైన్స్ గ్రూపు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. సెకండియర్‌లో గ్రూపుల వారీగా చూస్తే:
- MPC: 78.01 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది.
- BPC: 76.04 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది.
- MEC: 67.91 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
- CEC: 49.39 శాతానికి పరిమితమైంది.
- HEC: 49.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ (75.51 శాతం), బైపీసీ (72.39 శాతం) విద్యార్థులు రాణించగా, హెచ్ఈసీ విద్యార్థులు కేవలం 34.34 శాతంతో వెనుకబడ్డారు.
గ్రేడ్ల వారీగా వివరాలు
సెకండియర్ జనరల్ రెగ్యులర్ విద్యార్థులలో 'A' గ్రేడ్ (75 శాతం కంటే ఎక్కువ మార్కులు) సాధించిన వారు 2,13,179 మంది ఉన్నారు. 'B' గ్రేడ్ (60 శాతం నుండి 75 శాతం) 69,641 మందికి లభించింది. వొకేషనల్ స్ట్రీమ్‌లో కూడా ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి, సెకండియర్‌లో 71.15 శాతం మంది పాస్ అయ్యారు.
- ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.4 కాగా.. బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది.
- ఇక సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలకు మొత్తంగా 5,07,948 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 3,58,490 మంది (70.58 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
- బాలికల ఉత్తీర్ణత శాతం చూసుకుంటే 78.65గా ఉంది. అదే బాలురు ఉత్తీర్ణత 62.50 శాతంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పుకోవాలి.
- 2025లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత 66.91 శాతంగా ఉంది. అయితే ఈసారి 66.94 శాతంతో స్వల్పంగా పెరిగింది.
- అదే 2025లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల.. ఉత్తీర్ణత శాతం 72.43గా ఉండగా.. ఈసారిగా 75.61 శాతంగా నమోదైంది.
TS Inter 1st Year Results 2026 లింక్ క్లిక్ చేసి ఫలితాలు చూసుకోండి.
{{/usCountry}}TS Inter 1st Year Results 2026 లింక్ క్లిక్ చేసి ఫలితాలు చూసుకోండి.
{{/usCountry}}TS Inter 2nd Year Results లింక్ క్లిక్ చేసి సెకండ్ ఇయర్ ఫలితాలు చెక్ చేయండి.