TS Inter Results 2026 : వాట్సాప్ ద్వారా తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

TS Telangana Inter 1st 2nd Year Result 2026 : తెలంగాణ ఇంటల్ ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి విద్యార్థులు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Published on: Apr 12, 2026, 09:49:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విద్యార్థులు నేడు ఉదయం 11 గంటల నుంచి (ఏప్రిల్ 12, 2026) వాట్సాప్ ద్వారా నేరుగా తమ బోర్డ్ పరీక్ష ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏ పోర్టల్‌లోనూ లాగిన్ కావాల్సిన అవసరం లేదు. నెట్ సెంటర్‌ను సందర్శించాల్సిన అవసరం కూడా లేదు.

వాట్సాప్‌లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు
వాట్సాప్‌లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు

వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

  • 8096958096ని మీ కాంటాక్ట్‌లలో "MeeSeva Telangana"గా సేవ్ చేయండి
  • వాట్సాప్ తెరిచి "Hi" అని పైన నెంబర్‌కు పంపండి. మీసేవ చాట్‌బాట్ మొదలవుతుంది.
  • "BIE Exam Result" టైప్ చేసి ఓపెన్ సర్వీస్ నొక్కండి
  • మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ / 2వ), స్ట్రీమ్ (జనరల్ / వొకేషనల్) ఎంచుకోండి.
  • సబ్మిట్ చేయండి. మీ ఫలితం వాట్సాప్‌లో తక్షణమే కనిపిస్తుంది..
  • తర్వాత దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మీసేవ వాట్సాప్ కేవలం సౌకర్యం మాత్రమే కాదు, ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే ప్లాట్‌ఫారమ్, దీని ద్వారా ప్రభుత్వ సేవలు ప్రతి పౌరుడిని చేరుకుంటున్నాయని ప్రభుత్వం పేర్కొంటుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగాయి. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ మాత్రమే కాకుండా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్‌లోనూ సులభంగా తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి క్షణాల వ్యవధిలోనే డిస్‌ప్లే అవుతాయి.

ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఎలా చెక్ చేసుకోవాలి?

  • తెలంగాణ ఇంటర్ రిజల్స్ట్ కోసం అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని ఇంటర్ రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ బటన్‌ మీద క్లిక్ చేయండి.
  • అనంతరం ఫలితాలు మీ స్క్రీన్‌ మీద డిస్‌ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More