...
...
Next Story

TS Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ రిజల్ట్ చూడండి

TS Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఒక్క క్లిక్‌తో మీరు ఇక్కడ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఎలాగో చూడండి.

Published on: Apr 12, 2026, 11:00:08 IST
Advertisement

హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను ప్రకటించారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది ఇంటర్ ఫస్టియర్, 5,07,949 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల 2026
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల 2026

TS Inter 1st Year Results 2026 లింక్ క్లిక్ చేసి ఫలితాలు చూసుకోండి.

TS Inter 2nd Year Results లింక్ క్లిక్ చేసి సెకండ్ ఇయర్ ఫలితాలు చెక్ చేయండి.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 ఎలా చూడాలి?

  • తెలంగాణ ఇంటర్ రిజల్స్ట్ కోసం అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని ఇంటర్ రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ బటన్‌ మీద క్లిక్ చేయండి.
  • అనంతరం ఫలితాలు మీ స్క్రీన్‌ మీద డిస్‌ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని చేసుకోవచ్చు.

ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను నేరుగా చూసుకోండి.

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) 2026 మార్చి పరీక్షల ఫలితాలను ప్రకారం.. గత ఐదేళ్ల డేటాను పరిశీలిస్తే, ఈ ఏడాది జనరల్ స్ట్రీమ్ సెకండియర్‌లో అత్యధికంగా 75.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2022లో ఇది 68.68 శాతంగా ఉండగా, క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరడం విద్యార్థుల అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మెరుగుపడిందని సూచిస్తోంది. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కూడా 66.94 శాతం ఉత్తీర్ణత నమోదై, గత ఏడాది (66.91 శాతం) కంటే స్వల్ప వృద్ధిని కనబరిచింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe