తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలిసెట్) 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. మెుత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 86.38 శాతం, బాలురు 79.92 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. కళాశాల మరియు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన, రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ బోర్డు కార్యదర్శి ఎ. పుల్లయ్యతో కలిసి https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేశారు.

పాలిసెట్ 2026 ఎంపీసీ స్ట్రీమ్‌లో మొత్తం 98,029 మంది అభ్యర్థులు హాజరు కాగా, 81,307 మంది (82.94 శాతం) అర్హత సాధించారు. MBiPC స్ట్రీమ్‌లో 98,029 మంది విద్యార్థులు హాజరు కాగా, 79,652 మంది (81.25 శాతం) అర్హత సాధించినట్లు ప్రకటించారు.
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు 2026 ఎలా చెక్ చేసుకోవాలి?
అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ఓపెన్ చేయండి.
హోమ్‌పేజీలో కనిపించే TS POLYCET 2026 Rank Card లింక్‌పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి.
వివరాలు సరిచూసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ ర్యాంక్ కార్డ్ అవసరం కాబట్టి, దీనిని ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.
ఈ లింక్ క్లిక్ చేసి నేరుగా టీజీ పాలిసెట్ 2026 ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోండి.
టీజీ పాలిసెట్ 2026 - తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
- టీజీ పాలిసెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మే 27 నుంచి జూన్ మొదటి వారం వరకు సాగనుంది.
- మే 27 నుంచి 31 వరకు : అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ప్రాసెస్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
- మే 29 నుంచి జూన్ 1 వరకు : హెల్ప్‌లైన్ కేంద్రాలలో అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన (ధ్రువపత్రాల పరిశీలన) జరుగుతుంది.
- మే 29 నుంచి జూన్ 3 వరకు : సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
- జూన్ 6న : అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా మొదటి విడత సీట్ల కేటాయింపు చేపడతారు.
- జూన్ 6 నుంచి 9 వరకు : సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
- జూన్ 8 మరియు 9 తేదీల్లో : విద్యార్థులు తమకు సీటు వచ్చిన పాలిటెక్నిక్ కళాశాలల్లో నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలి.
- జూన్ 9న : పాలిటెక్నిక్ కొత్త విద్యా సంవత్సరం (తరగతులు) ప్రారంభమవుతుంది.
మొదటి విడత సీట్ల భర్తీ అనంతరం మిగిలిపోయిన సీట్ల కోసం చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై జూన్ 22వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత కూడా జూన్ 27 నుంచి జూన్ 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పించారు. దీని ద్వారా విద్యార్థులు తాము చేరిన కళాశాలలోనే ఒక బ్రాంచ్ (ఉదాహరణకు మెకానికల్) నుంచి మరో బ్రాంచ్ (ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్) కు మారడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరగా మిగిలిపోయే సీట్లను భర్తీ చేయడానికి జూలై 1 నుంచి జూలై 8వ తేదీల మధ్య స్పాట్ ప్రవేశాలు నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
{{/usCountry}}మొదటి విడత సీట్ల భర్తీ అనంతరం మిగిలిపోయిన సీట్ల కోసం చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై జూన్ 22వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత కూడా జూన్ 27 నుంచి జూన్ 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పించారు. దీని ద్వారా విద్యార్థులు తాము చేరిన కళాశాలలోనే ఒక బ్రాంచ్ (ఉదాహరణకు మెకానికల్) నుంచి మరో బ్రాంచ్ (ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్) కు మారడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరగా మిగిలిపోయే సీట్లను భర్తీ చేయడానికి జూలై 1 నుంచి జూలై 8వ తేదీల మధ్య స్పాట్ ప్రవేశాలు నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
{{/usCountry}}