TS SSC Results 2026 Released : విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ పాల్గొన్నారు.

మీరు ఫలితాలను హిందుస్థాన్ టైమ్స్ వెబ్‌సైట్‌లోనూ చూడవచ్చు. ఇందుకోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 విడుదల
అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు ఫలితాలను చెక్ చేయవచ్చు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సిద్ధంగా ఉంచుకుని కింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఫలితాలను పొందొచ్చు.
ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- https://results.bsetelangana.org , https://bse.telangana.gov.in, https://results.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే Regular & Private (SSC & OSSC) Results అనే లింక్ మీద క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి.
- నెంబర్ సరిచూసుకుని submit బటన్ మీద నొక్కండి.
- మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. మార్కుల షీట్ డౌన్‌లోడ్ చేసుకోవటంతో పాటు ప్రింట్ తీసుకోవడం బెటర్.
వాట్సాప్ ద్వారా ఇలా ఫలితాలు చూసుకోండి
1. మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana”గా సేవ్ చేసుకోండి.
2. WhatsApp ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపండి.
{{/usCountry}}2. WhatsApp ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపండి.
{{/usCountry}}3. “SSC Result” అని టైప్ చేయండి.
4. మెనులో ఓపెన్ సర్వీస్ ఎంపికపై క్లిక్ చేయండి.
5. మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
6. వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో WhatsAppలో డిస్ ప్లే అవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ వరకు జరిగాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. ఈ నెల 23వ తేదీ నాటికే పేపర్ల దిద్దుబాటు ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.