పసుపు క్వింటా ధర రూ.19,253.. మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపునకు రికార్డుస్థాయిలో ధర వచ్చింది. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు రికార్డు స్థాయి ధరతో రైతులకు ఆనందాన్ని ఇచ్చింది. చాలాకాలంగా ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాక నిరాశ చెందిన కర్షకులకు పెరిగిన ధరలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. సోమవారం జరిగిన ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఈ-నామ్) ఇ-వేలంలో పసుపు క్వింటా గరిష్ఠంగా రూ.19,253 పలికి కేసముద్రం మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఇటీవల పసుపు సీజన్ ప్రారంభంలో క్వింటా ధర రూ.12,000 దగ్గరే అటు ఇటు తిరిగింది. క్రమంగా రూ.16,000 వరకు పెరిగినప్పటికీ, ఈ నెల 22న నిర్వహించిన క్రయవిక్రయాల్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,319 వద్దే ఆగింది. అయితే రెండు రోజులు సెలవుల తర్వాత సోమవారం మార్కెట్‌కు వచ్చిన పసుపు నాణ్యత చాలా బాగుండడంతో వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేశారు. ఫలితంగా కేవలం ఒక్క రోజు తేడాలోనే క్వింటాపై రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ధర పెరగడం విశేషం. ఈ వేలంలో పాల్గొన్న రైతులు తీసుకువచ్చిన కాడి రకం, గోళ రకం పసుపు ఉత్పత్తులకు లభించిన ధరల వివరాలు.. చూస్తే..
కాడి రకం పసుపు
వచ్చిన సరుకు: 7గురు రైతులు – 69 బస్తాలు, గరిష్ఠ ధర: రూ. 19,253, కనిష్ఠ ధర: రూ. 15,589, సగటు ధర: రూ. 19,252.
గోళ రకం పసుపు
వచ్చిన సరుకు: 3గురు రైతులు – 30 బస్తాలు, గరిష్ఠ ధర: రూ. 18,566, కనిష్ఠ ధర: రూ. 8,506, సగటు ధర: రూ. 17,469.
మొత్తంగా సోమవారం మార్కెట్‌కు 99 బస్తాల పాత పసుపు నిల్వలు రాగా.. అంతటా ఊహించని రీతిలో రికార్డు ధర పలికింది. గతంతో పోలిస్తే ధరల గ్రాఫ్.. ఈ నెల 16న కాడి రకం గరిష్ఠం రూ. 11,609, కనిష్ఠం రూ. 7,011. అదే గోళ రకం గరిష్ఠం రూ. 10,511, కనిష్ఠంగా రూ.7011గా పలికింది. ఈ నెల 22న గరిష్ఠంగా రూ. 13,319 ధర పలికింది. సోమవారం ఒకేసారి రూ. 19,253కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.
కేసముద్రం మార్కెట్‌లో అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ (e-NAM) ఈ-వేలం విధానం ద్వారా రైతులకు సరైన న్యాయం జరుగుతోంది. వ్యాపారులు పారదర్శకంగా ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ దాఖలు చేయడం, ఈసారి మార్కెట్‌కు వచ్చిన పసుపులో తేమ శాతం తక్కువగా ఉండి నాణ్యతా ప్రమాణాలు గరిష్ఠంగా ఉండడంతో వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
పసుపు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు చూసుకుంటే.. మార్కెట్‌కు వచ్చిన పాత పసుపు సరుకు మంచి రంగు, నాణ్యత కలిగి ఉండడం. దేశీయ మార్కెట్లలో, ఎగుమతి వ్యాపారులలో పసుపునకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. మార్కెట్‌కు సరకు తక్కువగా ఉండటం వల్ల కొనుగోలుదారులు ఎక్కువ ధరకు కొంటున్నారు.
కేసముద్రం మార్కెట్ చరిత్రలోనే పసుపు పంటకు ఈ స్థాయిలో క్వింటా రూ. 19 వేలకు పైగా లభించడం ఇదే తొలిసారని మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు. మార్కెట్‌లో మెరుగైన ధర రావడంతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన నాణ్యతతో పంటను తీసుకువస్తే మంచి ధరలు పొందే అవకాశం ఉందని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


