Best SUV : హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ మారుతీ విక్టోరిస్- దేని ధర తక్కువ? ఎందులో ఫీచర్లు ఎక్కువ?
ఈ పండుగ సీజన్లో కారు షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! తాజాగా లాంచ్ అయిన హ్యుందాయ్ బేయాన్, ఇప్పటికే దుమ్మురేపుతున్న మారుతీ సుజుకీ విక్టోరిస్లను పోల్చి, ఏది వాల్యు బై? దేని ధర తక్కువ? వంటి వివరాలను తెలుసుకుందాము..
ఇండియాలో ఎస్‌యూవీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు సైతం పోటీపడుతూ కొత్త కొత్త మోడల్స్‌ని లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దిగ్గజ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తాజాగా 'బేయాన్' పేరుతో ఒక ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ మోడల్.. ఇప్పటికే మార్కెట్లో సేల్స్ పరంగా దూసుకెళుతున్న మారుతీ సుజుకీ విక్టోరిస్కి గట్టి పోటీ ఇస్తోంది.

ఈ నేపథ్యంలో హ్యుందాయ్ బేయాన్, మారుతీ సుజుకీ విక్టోరిస్ ఎస్‌యూవీలను పోల్చి, రెండింటిలో ఏది బెస్ట్? ఏది వాల్యూ బై? అనేది ఇక్కడ తెలుసుకుందాము. పండుగ సీజన్లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం!
1. హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ మారుతీ సుజుకీ విక్టోరిస్- ధరలు..
హ్యుందాయ్ బేయాన్ కారు ఎంట్రీ-లెవెల్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను మాత్రమే కంపెనీ ప్రకటించింది, అది రూ. 9,99,900 (పరిచయ ధర). దీని పూర్తి వేరియంట్ల వారీగా ధరల పట్టిక త్వరలోనే విడుదల కానుంది.
మరోవైపు, మారుతీ సుజుకీ విక్టోరిస్ విస్తృతమైన శ్రేణిలో లభిస్తోంది. ఇది మొత్తం 21 వేరియంట్లలో లభ్యమవుతుండగా, ఎక్స్-షోరూమ్ ధర రూ. 10,49,900 నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 19,98,900 వరకు ఉంటుంది.
విక్టోరిస్ ప్రారంభ ధరతో పోలిస్తే బేయాన్ రూ. 50,000 తక్కువకే అందుబాటులోకి వచ్చి కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.
| హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ మారుతీ సుజుకీ విక్టోరిస్: డైమెన్షన్స్ | ||
|---|---|---|
| హ్యుందాయ్ బేయాన్ (ఎంఎం) | మారుతీ సుజుకీ విక్టోరిస్ (ఎంఎం) | |
| పొడవు | 4,245 | 4,360 |
| వెడల్పు | 1,810 | 1,795 |
| ఎత్తు | 1,605 | 1,655 |
| వీల్‌బేస్ | 2,600 | 2,600 |
| బూట్ స్పేస్ | 505 లీటర్లు | 439- 446 లీటర్లు |
సైజు పరంగా మారుతీ సుజుకీ విక్టోరిస్ కొద్దిగా ఎక్కువ పొడవు, ఎత్తు కలిగి ఉండగా, హ్యుందాయ్ బేయాన్ ఎక్కువ వెడల్పును కలిగి ఉంది. అయితే లగేజీ స్టోరేజ్ (బూట్ స్పేస్) విషయంలో బేయాన్ ఏకంగా 505 లీటర్ల ఖాళీ స్పేస్‌ని అందిస్తూ విక్టోరిస్‌పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
2. హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ మారుతీ సుజుకీ విక్టోరిస్- ఫీచర్లు, టెక్..
ఇంటిరియర్, టెక్నాలజీ విభాగాల్లో ఈ రెండూ ఎస్‌యూవీలు కూడా ఆధునిక ఫీచర్లతో పోటీపడుతున్నాయి:
హ్యుందాయ్ బేయాన్: డ్యాష్‌బోర్డ్‌పై జంట 12.3-అంగుళాల కర్వ్‌డ్ డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ డిజిటల్ క్లస్టర్) ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పర్ప్‌లెక్సిటీ, సౌండ్ హౌండ్ ఆధారిత జెనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఇందులో ఉండి, 10 భారతీయ ప్రాంతీయ భాషలను మద్దతు ఇస్తుంది. లెవెల్-2 అడాస్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరాలను అందించారు.
మారుతీ సుజుకీ విక్టోరిస్: 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. భారత్ ఎన్సీఏపీలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, లెవెల్-2 అడాస్ దీని సొంతం.
| హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ మారుతీ సుజుకీ విక్టోరిస్- ఇంజిన్ | ||
|---|---|---|
| హ్యుందాయ్ బేయాన్ | మారుతీ సుజుకీ విక్టోరిస్ | |
| ఇంజిన్ | 1.5L four-cylinder MPi Petrol | 1.5L K-Series Mild-Hybrid / 1.5L Strong Hybrid / CNG |
| పవర్ | 113 bhp | 102 bhp (Mild) / 114 bhp (Hybrid) / 87 bhp (CNG) |
| టార్క్ | 144 Nm | 137 Nm (Mild) / 122 Nm + 141 Nm Motor (Hybrid) |
| ట్రాన్స్మిషన్ | 6-speed MT & IVT (CVT) | 5-speed MT, 6-speed AT, e-CVT |
| డ్రైవ్‌ట్రెయిన్ | Front-Wheel Drive (FWD) | Front-Wheel Drive (FWD) & AllGrip AWD |
| మైలేజీ | ~17.5 – 18.2 kmpl | 21.18 kml (Mild) / 28.65 kmpl (Strong Hybrid) |
4. హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ మారుతీ సుజుకీ విక్టోరిస్- ఇంజిన్..
హ్యుందాయ్ బేయాన్‌లో నమ్మకమైన 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు, ఇది అత్యుత్తమ రీఫైన్‌మెంట్, స్మూత్ ఆటోమేటిక్ గేర్‌షిఫ్ట్‌లను అందిస్తుంది. ఇది కాకుండా, 2027 జనవరి నుంచి ఇందులో పెట్రోల్-సీఎన్జీ ఆప్షన్ కూడా రానుంది.
ఇక మారుతీ సుజుకీ విక్టోరిస్ విషయానికొస్తే, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మల్టీ-ఫ్యూయల్ ఆప్షన్లను అందిస్తోంది. మైల్డ్-హైబ్రిడ్, అత్యధిక మైలేజ్ ఇచ్చే స్ట్రాంగ్-హైబ్రిడ్, సీఎన్జీలతో పాటు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా విక్టోరిస్‌లో లభిస్తుంది.
హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ మారుతీ సుజుకీ విక్టోరిస్- ఏది కొనాలి?
తక్కువ ధరలో లేటెస్ట్ జెనరేటివ్ ఏఐ టెక్నాలజీ, ప్రీమియం డ్యూయల్ డిస్‌ప్లేలు, భారీ బూట్ స్పేస్ కోరుకునే వారికి హ్యుందాయ్ బేయాన్ అద్భుతమైన ఎంపిక. అలా కాకుండా, ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్, ఆల్-వీల్ డ్రైవ్, పనోరమిక్ సన్‌రూఫ్ కావాలనుకునే వారికి మారుతీ సుజుకీ విక్టోరిస్ సరైన ఆప్షన్‌గా నిలుస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


