Hyundai Bayon : సీఎన్జీ, అడాస్​ సేఫ్టీ ఫీచర్లతో హ్యుందాయ్ బేయాన్- ఎస్​యూవీ లాంచ్ త్వరలోనే!

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ‘బేయాన్’ పేరుతో సరికొత్త ఎస్‌యూవీని హ్యుందాయ్ తీసుకొస్తోంది. వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య స్థానం సంపాదించనున్న ఈ కారులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ, లెవెల్-2 అడాస్, అండర్‌బాడీ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు.

Published on: Sep 17, 2026, 05:59:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త 'బేయాన్' ఎస్​యూవీని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది దిగ్గజ హ్యుందాయ్ మోట్ర్స్. అక్టోబర్-నవంబర్ పండుగ సీజన్ నాటికి ఈ కారును అధికారికంగా మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో విశేష ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ వెన్యూ, క్రెటా కార్ల మధ్య ఈ కొత్త బేయాన్ ఎస్‌యూవీ కొలువుదీరనుంది.

హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీ వచ్చేస్తోంది!
హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీ వచ్చేస్తోంది!

ఇక ఇప్పుడు ఈ కొత్త ఎస్​యూవీకి సంబంధించి కొన్ని కొత్త విషయాలు తెలిసాయ. ఈ బేయాన్ ఎస్​యూవీ సీఎన్జీ ఆప్షన్​తో, లెవల్​-2 అడాస్​ ఫీచర్లతో రానుంది!

బూట్ స్పేస్ తగ్గని 'అండర్‌బాడీ సీఎన్జీ' ప్రత్యేకత!

సాధారణంగా సీఎన్జీ కార్లలో డిక్కీ (బూట్) స్పేస్ అంతా గ్యాస్ సిలిండర్ ఆక్రమిస్తుంది. కానీ, హ్యుందాయ్ బేయాన్ కారులో ఈ సమస్యకు చెక్ పడుతున్నారు. 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న కార్లలో సీఎన్జీ ఆప్షన్‌తో వస్తున్న తొలి హ్యుందాయ్ మోడల్ ఇదే కావడం విశేషం. ఈ కారులో అండర్‌బాడీ సీఎన్జీ ట్యాంక్ సిస్టమ్‌ను అమర్చనున్నారు. దీనివల్ల ప్రయాణికుల సామాను పెట్టుకోవడానికి డిక్కీలో తగినంత స్థలం అందుబాటులో ఉంటుంది. 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రానున్న ఈ కారులో 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లను అందిస్తున్నారు.

భద్రతలో కాంప్రమైజ్ లేని 'లెవెల్-2 అడాస్'!

ప్రస్తుతం వాహనదారులు సేఫ్టీ ఫీచర్లకు పెద్దపీట వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీలో 'లెవెల్-2 అడాస్' (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సాంకేతికతను జోడించారు. లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తాయి. ప్రమాదాల నివారణకు ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అన్ని వేరియంట్లలోనూ అందించనున్నారు.

ప్రీమియమ్ కేబిన్.. డ్యూయల్ స్క్రీన్ల హంగులు..

ఎస్​యూవీ లోపలి కేబిన్‌ను ఎంతో ఆకర్షణీయంగా రూపొందించారు. డాష్‌బోర్డ్ పై రెండు 10.25-అంగుళాల డిజిటల్ స్క్రీన్లను అమర్చారు. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా పనిచేస్తే, మరొకటి డ్రైవర్ డిస్‌ప్లే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా హ్యుందాయ్ బేయాన్​లో వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అధునాతన ప్రీమియం ఫీచర్లు ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతలు!

స్టైలిష్ లుక్.. అగ్రెసివ్ డిజైన్..

బయట డిజైన్ పరంగా హ్యుందాయ్ బేయాన్ రోడ్డుపై ఎంతో అగ్రెసివ్ లుక్‌ను ఇస్తుంది. బాణం గుర్తు ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు, ముందు భాగంలో కిందికి అమర్చిన గ్రిల్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్స్, చుట్టూ ఉన్న బాడీ క్లాడింగ్ దీనికి పక్కా ఎస్‌యూవీ రూపాన్ని ఇస్తాయి.

భారత మార్కెట్లో మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ హ్యుందాయ్ బేయాన్ లాంచ్ డేట్, ధర సహా ఇతర వివరాలపై సంస్థ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More