Hyundai Bayon : 35కుపైగా సేఫ్టీ ఫీచర్లు, ఏఐ అసిస్టెంట్‌తో హ్యుందాయ్ బేయాన్ లాంచ్- ధర..
భారత మార్కెట్లో హ్యుందాయ్ మోటార్స్ తన సరికొత్త కాంపాక్ట్ ఎస్యూవీ ‘బేయాన్’ను రూ. 9.99 లక్షల ప్రారంభ ధరతో అధికారికంగా విడుదల చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాయిస్ అసిస్టెంట్, లెవెల్-2 ప్రొ అడాస్, పవర్ఫుల్ ఫీచర్లతో వచ్చిన ఈ కారు పూర్తి వివరాలు ఇవే..
భారత ఆటోమొబైల్ రంగంలోని ఎస్యూవీ విభాగంలో సరికొత్త విప్లవానికి తెరతీస్తూ ప్రముఖ దక్షిణ కొరియా వాహన దిగ్గజం 'హ్యుందాయ్ మోటార్ ఇండియా' తమ మోస్ట్ అవైటెడ్ మోడల్ ‘హ్యుందాయ్ బేయాన్’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. హ్యుందాయ్ లైనప్‌లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న సబ్-4 మీటర్ ఎస్యూవీ 'వెన్యూ', పాపులర్ మిడ్-సైజ్ ఎస్యూవీ 'క్రెటా'లకు మధ్య ఉన్న కేటగిరీని లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త క్రాస్ఓవర్ ఎస్‌యూవీని సంస్థ డిజైన్ చేసింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో టెక్నాలజీతో కూడిన లగ్జరీ కార్లను కోరుకునే ఆధునిక కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ కారులో విప్లవాత్మక ఫీచర్లను జోడించారు. జనరేటివ్ ఏఐ అసిస్టెంట్, డ్యూయెల్-స్క్రీన్ కాక్‌పిట్, లెవెల్-2 ప్రో అడాస్ భద్రతా ఫీచర్లతో వచ్చిన తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీగా బేయాన్ నిలిచింది.
హ్యుందాయ్ బేయాన్ ఎస్యూవీ- జెనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్..
హ్యుందాయ్ మోటార్ ఇండియా చరిత్రలోనే మొదటిసారిగా బేయాన్ ఎస్‌యూవీలో జనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను పరిచయం చేశారు. ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫారమ్ ‘పర్ప్లెక్సిటీ’, ‘సౌండ్ హౌండ్ ఏఐ’ సాంకేతికతలను మేళవించి దీనిని రూపొందించారు. డ్రైవర్లు తమ సాధారణ మాటలతోనే కారుతో మాట్లాడవచ్చు. రియల్ టైమ్ డ్రైవింగ్ హెల్ప్, నేవిగేషన్, సమాచారాన్ని ఇది అందిస్తుంది.
ఎన్విడియా మద్దతుతో పనిచేసే కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్, 70కి పైగా బ్లూలింక్ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) సాఫ్ట్వేర్ అప్డేట్లను ఈ కారు సపోర్ట్ చేస్తుంది. డాష్‌బోర్డ్‌పై జంట 12.3-అంగుళాల కర్వ్డ్ పనోరమిక్ డిస్ప్లేలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అంతేకాకుండా 500కి పైగా ఇన్-బిల్ట్ వాయిస్ కమాండ్ల ద్వారా కారులోని వివిధ ఫంక్షన్లను సులువుగా నియంత్రించవచ్చు.
హ్యుందాయ్ బేయాన్- అట్రాక్టివ్ ఎక్స్టీరియర్, విలాసవంతమైన ఇంటీరియర్..
డిజైన్ పరంగా హ్యుందాయ్ బేయాన్ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది:
ఎక్స్టీరియర్: హెచ్-ఎడ్జ్ ఎల్ఈడీ డీఆర్ఎల్లు, డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లాంప్లు, పదునైన బోనెట్, రూఫ్ రెయిల్స్, స్పోర్టీ రియర్ స్పాయిలర్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
వీల్స్ అండ్ క్లియరెన్స్: 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు భారతీయ రహదారుల గుంతలను సైతం సులభంగా దాటేసేలా 205 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందించారు.
ఇంటీరియర్ కంఫర్ట్: లోపల లెథరెట్ సీట్లు, అంబియంట్ లైటింగ్, సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, డి-కట్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-టోన్ కలర్ థీమ్‌లను అమర్చారు. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఆప్షన్‌గా లభిస్తుంది.
విశాలమైన స్థలం: 2,600 ఎంఎం వీల్‌బేస్ కారణంగా ముందు వరుసలో 1,050 ఎంఎం, వెనుక వరుసలో 963 ఎంఎం అత్యుత్తమ లెగ్‌రూమ్ లభిస్తుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్లతో పాటు భారీ 505 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.
హ్యుందాయ్ బేయాన్- పవర్ఫుల్ ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు..
ఈ కారులో 1.5-లీటర్ MPi 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 115 పీఎస్ పవర్, 143.8 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గేర్‌బాక్స్: కస్టమర్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఐవీటీ ఆటోమేటిక్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
డ్రైవింగ్ మోడ్స్: ఐవీటీ ఆటోమేటిక్ వెర్షన్లో ప్యాడిల్ షిఫ్టర్లు, ఇకో, నార్మల్, స్పోర్ట్ మోడ్లు ఉంటాయి. ఓవర్‌టేకింగ్ చేయడానికి వేగవంతమైన పవర్ ఇచ్చే 'డ్యాష్ బూస్ట్ మోడ్', సడెన్ యాక్సిలరేషన్ కోసం 'స్పోర్టీ డ్రైవ్ టెక్'లను అందించారు.
హ్యుందాయ్ బేయాన్- భద్రతలో 5-స్టార్ రేటింగ్ లక్ష్యంగా..
ప్రయాణికుల భద్రతకు హ్యుందాయ్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. గ్లోబల్ కే ఎన్హాన్స్డ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఈ కారు, భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించేలా ఇంజనీరింగ్ చేశారు.
హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్-2 ప్రో అడాస్ సాంకేతికతను ఇందులో ఇచ్చారు.
నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ సహా మొత్తం 80కి పైగా అడ్వాన్స్డ్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 35కి పైగా సేఫ్టీ ఫీచర్లను బేస్ వేరియంట్ నుంచే ప్రామాణికంగా అందిస్తున్నారు.
హ్యుందాయ్ బేయాన్ సీఎన్జీ వేరియంట్ ఎప్పుడ?
మైలేజ్ ప్రియుల కోసం హ్యుందాయ్ మరొక తీపి కబురు అందించింది! ప్రసుతం పెట్రోల్ మోడల్‌ను లాంచ్ చేసిన కంపెనీ, 2027 జనవరిలో బేయాన్ ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


