New Scooter : హోండా నుంచి కొత్త స్కూటర్- అదిరిపోయే స్పోర్టీ లుక్‌తో..
Honda Click 125 : టూవీలర్ రంగంలో రారాజుగా వెలుగుతున్న హోండా.. భారత మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ‘హోండా క్లిక్’ డిజైన్ పేటెంట్‌ను భారత్‌లో ఫైల్ చేయడంతో వాహన ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలు..
Honda new scooter in India : గడచిన రెండు దశాబ్దాలుగా 'హోండా యాక్టివా'తో భారత స్కూటర్ మార్కెట్‌ను శాసిస్తోంది హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా యువతను ఆకట్టుకునేందుకు ఇప్పుడు మరింత స్పోర్టీగా ఉండే ఒక కొత్త స్కూటర్ని సంస్థ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. దాని పేరు హోండా క్లిక్ 125. ఇప్పటికే ఆగ్నేయ ఆసియా దేశాలైన థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌లో ఈ స్కూటర్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇక ఇప్పుడు ఈ స్కూటర్ని ఇండియాలో కూడా పేటెంట్ చేసింది సంస్థ. దీని నుంచి పలు కీలక విషయాలు అందుబాటులోకి వచ్చాయి.

హోండా క్లిక్ 125- అదిరిపోయే స్పోర్టీ డిజైన్..
హోండా క్లిక్ డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా అగ్రెసివ్‌గా, షార్ప్‌గా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఎన్ టార్క్ 125, హీరో జూమ్ 125ఆర్, సుజుకీ బర్గ్‌మన్ వంటి మోడళ్లకు ఇది నేరుగా పోటీనివ్వనుంది.
వీల్స్: సాధారణ స్కూటర్లలో ఉండే 12- ఇంచ్ చక్రాలకు భిన్నంగా, ఇందులో 14- ఇంచ్ భారీ వీల్స్ ఉండటం దీని ప్రత్యేకత. ఇది ప్రయాణంలో మంచి స్టెబిలిటీని ఇస్తుంది.
లైటింగ్: పూర్తిస్థాయి ఎల్ఈడీ లైటింగ్ సెటప్, ఏప్రాన్-మౌంటెడ్ హెడ్ ల్యాంప్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి.
స్టైలింగ్: డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్, స్పోర్టీ గ్రాఫిక్స్, స్టెప్డ్ సింగిల్-పీస్ సీటుతో యువతను ఇట్టే ఆకట్టుకుంటుంది.
హోండా క్లిక్ 125- ఇంజిన్ సామర్థ్యం, పర్ఫార్మెన్స్..
హోండా క్లిక్ 125 స్కూటర్లో అమర్చే ఇంజిన్ తన ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందే ఉంటుంది.
లిక్విడ్ కూలింగ్: సాధారణంగా 125సీసీ స్కూటర్లలో ఎయిర్ కూల్డ్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజిన్లు ఉంటాయి. కానీ హోండా క్లిక్‌లో 125సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను వాడనున్నారు. ఇది లాంగ్ రైడ్స్‌లో ఇంజిన్ వేడెక్కకుండా చూస్తుంది.
పవర్: ఇది గరిష్టంగా 11 బీహెచ్పీ పవర్, 10 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మైలేజ్: లీటరుకు సుమారు 49.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంచనా.
బరువు: ఈ స్కూటర్ బరువు కేవలం 111 కేజీలు మాత్రమే, దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపవచ్చు.
హోండా క్లిక్ 125- స్మార్ట్ ఫీచర్లు..
టెక్నాలజీ పరంగానూ హోండా తగ్గలేదు. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీ-లెస్ స్టార్ట్ కోసం స్మార్ట్ కీ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 18 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌తో పాటు టెలిస్కోపిక్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
హోండా క్లిక్ 125- లాంచ్ ఎప్పుడు?
హోండా కేవలం డిజైన్ పేటెంట్‌ను మాత్రమే ఫైల్ చేసింది. అయితే ఈ స్కూటర్ ఖచ్చితంగా వస్తుందని హోండా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కొన్నిసార్లు కంపెనీలు తమ డిజైన్ హక్కుల కోసం కూడా పేటెంట్ ఫైల్ చేస్తుంటాయి. అలా అని పేటెంట్ చేసిన ప్రతిదీ ప్రొడక్షన్ స్టేజ్ వరకు వెళుతుందని చెప్పలేము. కానీ, ఒకవేళ భారత్‌లో లాంచ్ అయితే మాత్రం, 125సీసీ ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో ఈ హోండా క్లిక్ 125 కొత్త సంచలనం కావడం ఖాయం.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. హోండా క్లిక్ 125 ప్రత్యేకత ఏంటి?
ఇందులో 14- ఇంచ్ పెద్ద వీల్స్, 125సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండటం ప్రధాన ఆకర్షణ. ఇది స్పోర్టీ లుక్‌తో యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.
2. దీని మైలేజ్ ఎంత ఉండవచ్చు?
ప్రాథమిక సమాచారం ప్రకారం, హోండా క్లిక్ లీటరుకు సుమారు 49.3 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
4. ఇందులో స్మార్ట్ కీ ఫీచర్ ఉంటుందా?
అవును, ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో ఉన్న మోడల్ ప్రకారం, ఇందులో కీ-లెస్ గో ఫంక్షనాలిటీతో కూడిన స్మార్ట్ కీ సిస్టమ్ ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


