Honda City : హోండా సిటీపై అదిరిపోయే ఆఫర్లు- రూ. 3లక్షల వరకు బెనిఫిట్స్​!

Discounts on Honda Cars : హోండా కార్స్ ఇండియా తన పాపులర్ సెడాన్ 'హోండా సిటీ'పై రూ. 3 లక్షల వరకు భారీ బెనిఫిట్స్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Published on: Mar 23, 2026, 12:20:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా, భారత మార్కెట్​లో తన పట్టును మరింత పెంచుకునేందుకు అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా హోండా సిటీపై కళ్లు చెదిరే ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

హోండా సిటీపై అదిరిపోయే ఆఫర్లు
హోండా సిటీపై అదిరిపోయే ఆఫర్లు

హోండా సిటీపై రూ. 3 లక్షల వరకు లాభం!

మీరు హోండా సిటీ సెడాన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం! మార్చి 31, 2026 వరకు ఈ కారుపై రూ. 3 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్లు కేవలం ఎంవై25 (మోడల్​ ఇయర్​ 2025) మోడళ్లకు మాత్రమే వర్తిస్తాయని గమనించాలి.

ఈ బెనిఫిట్స్​కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ సమీపంలోని హోండా డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

హోండా సిటీ ప్రారంభ ధర రూ. 11.95 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 16.07 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్).

ఇంజిన్: ఇందులో 1.5-లీటర్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 119 బీహెచ్​పీ పవర్, 145 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది.

సిటీ మాత్రమే కాదు పోర్ట్​ఫోలియోలోని ఇతర మోడల్స్​పై కూడా హోండా సంస్థ అదిరే ఆఫర్లను ఇస్తోంది. వాటి గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

హోండా తొలి ఈవీ '0 ఆల్ఫా' టెస్టింగ్ షురూ..

మరోవైపు భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలోకి హోండా ఘనంగా ప్రవేశిస్తోంది. తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ '0 ఆల్ఫా' ఆన్-రోడ్ టెస్టింగ్‌ను ప్రారంభించింది. రాజస్థాన్‌లోని తపుకరా తయారీ ప్లాంట్ నుంచి మార్చి 16, 2026న ఈ టెస్ట్ వాహనం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో వివిధ పరీక్షలకు గురికానుంది.

భారీ పెట్టుబడి.. గ్లోబల్ ప్లాన్..

హోండా తన ఈవీ ప్రయాణం కోసం రూ. 1,200 కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించింది. ఇందులో భాగంగా తపుకరా ప్లాంట్‌ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అనుగుణంగా ఆధునీకరించారు. ఈ ప్లాంట్ కేవలం భారత మార్కెట్ అవసరాలకే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే కేంద్రంగా కూడా పనిచేయనుంది.

లాంచ్ ఎప్పుడు?

'0 ఆల్ఫా' కారు 2026–27 ఆర్థిక సంవత్సరంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఇది ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మంచి డ్రైవింగ్ రేంజ్, ఆధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ మోడల్ అయ్యే అవకాశం ఉంది.

భారత ఈవీ మార్కెట్​లో పోటీ పెరుగుతున్న తరుణంలో, హోండా ఆలస్యంగానైనా బలమైన పునాదితో రంగంలోకి దిగుతోంది. హోండా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం '0 ఆల్ఫా' విజయానికి కీలకం కానుంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. హోండా సిటీపై లభించే రూ. 3 లక్షల డిస్కౌంట్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుందా?

కాదు. ఈ గరిష్ట ప్రయోజనం ప్రధానంగా ‘సిటీ హైబ్రిడ్’ మోడల్‌పై లభిస్తోందని తెలుస్తోంది. సాధారణ పెట్రోల్ వేరియంట్లపై డిస్కౌంట్ రూ. 1.56 లక్షల వరకు ఉంటుంది. అలాగే, ఈ ఆఫర్లు కేవలం 2025 మోడల్ ఇయర్ (MY25) స్టాక్‌పై మాత్రమే, మార్చి 31, 2026 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేరియంట్, నగరాన్ని బట్టి ఆఫర్ మొత్తంలో మార్పులు ఉండవచ్చు.

2. హోండా '0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ కారు ధర ఎంత ఉండవచ్చు? ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది?

హోండా '0 ఆల్ఫా' ఎలక్ట్రిక్ కారును 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో (ఎఫ్​వై 2026–27) లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ. 17 లక్షల నుంచి రూ. 22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇది మార్కెట్​లోకి వచ్చినప్పుడు హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతీ సుజుకీ ఈ-విటారా వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది.

3. హోండా 0 ఆల్ఫా ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది?

ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఒకే ఛార్జ్‌పై సుమారు 450 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో 60kWh నుండి 75kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను వాడే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల కేవలం 30 నిమిషాల్లోనే గణనీయమైన స్థాయిలో ఛార్జింగ్ చేసుకోవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More