Electric Scooter : ఏథర్ రిజ్టాకి పోటీగా కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- 200 కి.మీ రేంజ్‌తో!
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ', ఫ్యామిలీ సెగ్మెంట్‌లో తన తొలి స్కూటర్ ‘సింపుల్ అరైవ్’ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల బెంగళూరు వీధుల్లో టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఈ స్కూటర్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది. వివరాలు..
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ', తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది! కంపెనీ ఇటీవల ‘సింపుల్ వన్ జెన్ 2’ పేరుతో అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను విడుదల చేయడమే కాకుండా, ఒకే ఛార్జ్‌పై 400 కి.మీ రేంజ్ ఇచ్చే 'సింపుల్ వన్ అల్ట్రా' వేరియంట్‌ను కూడా ప్రకటించింది. ఇక ఇప్పుడు ఈ సంస్థ ఒక కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకురాబోతోంది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

సింపుల్ అరైవ్ ఈవీ..
ప్రస్తుతం ఈ కంపెనీ వద్ద టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా, హీరో విడా వీఎక్స్2 వంటి దిగ్గజ మోడళ్లకు పోటీనిచ్చే 'ఫ్యామిలీ-ఫార్మాట్' ఎలక్ట్రిక్ స్కూటర్ లేదు. ఈ లోటును భర్తీ చేయడానికి, సింపుల్ ఎనర్జీ తన మొట్టమొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘అరైవ్’ను తీసుకువస్తోంది.
దీనికి సంబంధించిన టెస్ట్ మోడల్ తొలిసారిగా స్పై షాట్స్‌లో బయటపడింది.
సింపుల్ అరైవ్ ఈవీ విశేషాలు..
కొంతకాలం క్రితమే సింపుల్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పేటెంట్ అయ్యింది. ఇది ఆ స్కూటర్ బాహ్య రూపాన్ని వెల్లడించింది. మొదటి పేటెంట్ డిజైన్ అక్టోబర్ 2025లో బయటకు రాగా, గత నెలలో మరికొన్ని డిజైన్ లీక్‌లు జరిగాయి. ఈ రెండు లీక్డ్ డిజైన్లలోనూ మినిమలిస్టిక్ లుక్‌తో కూడిన ఫ్యామిలీ స్కూటర్ కనిపించింది.
ఇప్పుడు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కెమెరాకు చిక్కిన టెస్ట్ మోడల్‌లో కూడా సరిగ్గా అవే పోలికలు ఉన్నాయి. ఈ స్కూటర్ పూర్తిగా క్యామోఫ్లేజ్ (ముసుగు)తో కప్పి ఉన్నప్పటికీ, కంపెనీ ఇటీవల ఫైల్ చేసిన ట్రేడ్‌మార్క్ ఐపీలను బట్టి దీనికి 'సింపుల్ అరైవ్' అని పేరు పెట్టే అవకాశం ఉంది.
ఈ సింపుల్ అరైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ‘సింపుల్ అరైవ్’, 'సింపుల్ అరైవ్ ప్లస్' అనే రెండు వేరియంట్లు ఉండవచ్చు.
సింపుల్ అరైవ్ ఈవీ- డిజైన్, ప్రత్యేకతలు..
డిజైన్ విషయానికి వస్తే, ఇందులో చాలా సింపుల్‌గా ఉండే ఫ్రంట్ ఆప్రాన్ ఉంది. ఇది డ్యూయల్-ఛాంబర్ హెడ్‌లైట్లను కలిగి ఉంది, ఇవి బహుశా ఎల్‌ఈడీ బల్బులతో వస్తాయి. టర్న్ ఇండికేటర్లు హ్యాండిల్‌బార్ కౌల్ వద్ద ఉండవచ్చు. చక్రాల విషయానికి వస్తే, 5-స్పోక్ ప్యాటర్న్ కలిగి ఉండి, ప్రతి ఎలిమెంట్ రెండుగా విడిపోయినట్లుగా ఉంది.
Summer car care guide : వేసవిలో మీ కారు భద్రంగా ఉండాలా? ఈ సమ్మర్ సేఫ్టీ చెక్స్ తప్పనిసరి..
పేటెంట్ డిజైన్లలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కనిపించలేదు, కానీ ఈ స్పై షాట్స్ ద్వారా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో పొడవైన, ఫ్లాట్ డిజైన్ కలిగిన సీటు ఉంది. వెనుక భాగంలో సింగిల్-పీస్ గ్రాబ్ రైల్, దాని కింద సన్నని ఎల్‌ఈడీ టెయిల్ లైట్ స్ట్రిప్ ఉన్నాయి. ఈ స్ట్రిప్‌లోనే టర్న్ ఇండికేటర్లు కూడా కలిపి ఉండే అవకాశం ఉంది.
సింపుల్ అరైవ్ ఈవీ- ఏం ఆశించవచ్చు?
రాబోయే సింపుల్ అరైవ్ ఈవీ స్కూటర్లో మరికొన్ని ముఖ్యమైన అంశాలు కనిపిస్తున్నాయి:
మెయిన్ స్టాండ్, సైడ్ స్టెప్పింగ్ ఫుట్ రెస్ట్ (లేడీస్ కోసం).
ఆప్రాన్ వెనుక భాగంలో స్టోరేజ్ కంపార్ట్‌మెంట్.
టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంది.
మిడ్-మౌంటెడ్ మోటార్ ఉంటుంది, ఇది బెల్ట్-డ్రైవ్ లేదా చైన్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా వెనుక చక్రాన్ని నడిపిస్తుంది.
సింపుల్ అరైవ్ ఈవీ- బ్యాటరీ, రేంజ్, లాంచ్ వివరాలు..
సింపుల్ అరైవ్ ఈవీ పవర్‌ట్రెయిన్ గురించి ప్రస్తుతం ఎటువంటి అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే, ఇది 'సింపుల్ వన్ ఎస్' (3.7 కేడబ్ల్యూహెచ్) తరహాలోనే బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండి, ఒకే ఛార్జ్‌పై దాదాపు 200 కి.మీ రేంజ్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా.
ఈ స్కూటర్ లాంచ్ ఏప్రిల్ 2026 లేదా మే 2026లో జరిగే అవకాశం ఉంది. అప్పుడే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


