తెలంగాణ ప్రభుత్వ ఈవీ పాలసీ.. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉద్యోగులకు స్పెషల్ డిస్కౌంట్

Telangana EV Policy : తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చింది. ఉద్యోగులకు ఈవీల కొనుగోలుపై డిస్కౌంట్ అందిస్తోంది.

Published on: Mar 24, 2026, 18:37:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈవి పాలసీ తీసుకొచ్చింది. ఈవీ పాలసీతో జీరో రోడ్ టాక్స్, జీరో రిజిస్టేషన్ టాక్స్ మినహాయింపు ఉంటుంది. దాని ద్వారా దాదాపు వెయ్యి కోట్లు ప్రభుత్వం నష్టపోయిన ఈవీ పాలసీని ప్రోత్సహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ ఈవీ పాలసీ
తెలంగాణ ప్రభుత్వ ఈవీ పాలసీ

'ఈవీ పాలసీ వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. అందువల్ల ఇటీవల రవాణా శాఖ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం ఉద్యోగులకు ప్రోత్సాహం ఇవ్వాలని తయారీ దారులను కోరాం. ప్రభుత్వ సంస్థలకు హైర్ లేదా డిపార్ట్మెంట్‌లు కొనుగోలు చేస్తే.. ఈవీ వాహనాలు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈవీ వాహనాలకు అన్ని ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీదారులు ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం వారు డిస్కౌంట్ ఇస్తారు. మహేంద్ర ఎలెక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలాతోపాటు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి.' అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

క్యూర్ ఏరియాలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని పొన్నం వెల్లడించారు. క్యూర్ ఏరియాలో డీజిల్ ఆటోలు కూడా మార్చి నడపాలని నిర్ణయం తీసుకుందన్నారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపేజీ కి పంపిస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్టుగా పేర్కొన్నారు. తెలంగాణలో వాహన్ పోర్టల్‌లోకి చేరామన్నారు. వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్‌లోనే రిజిస్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

మెుత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలపై 20 శాతం వరకు రాయితీలను అందిస్తుంది. ఈ ప్రత్యేకమైన చర్య వల్ల తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగికి రూ.4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

ఈ పథకం గురించి మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలు మరింత సరసమైనవిగా, అందుబాటులో ఉండేవిగా, రోజువారీ వినియోగానికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇది ప్రజలకు, భూగోళానికి కూడా మేలు చేసే పరిపాలన అని మంత్రి అన్నారు.

ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలు కేవలం ఈవీలను మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రధాన పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలి. ఇది స్వచ్ఛమైన, సుస్థిరమైన రవాణా వ్యవస్థను నిర్మించాలనే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా 2,800కు పైగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది.

'ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై 20 శాతం వరకు ప్రత్యేక రాయితీ ఉంటుంది. తెలంగాణను గ్రీన్ మొబిలిటీ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాం. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఈవీ వాహనాలు వినియోగించండి. ఈవీ వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్ ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు.' అని మంత్రి పొన్నం వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More