Hybrid cars : డస్టర్ వర్సెస్ గ్రాండ్ విటారా, విక్టోరిస్, హైరైడర్.. ధర, మైలేజ్‌లో ఏ హైబ్రిడ్ కారు బెస్ట్?
భారత ఆటోమొబైల్ విపణిలోకి రెనాల్ట్ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్యూవీ అధికారికంగా అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఇప్పటికే ఉన్న మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, విక్టోరిస్, టయోటా హైరైడర్‌లతో దీనిని పోల్చి.. ధర, మైలేజ్ విషయంలో ఏది బెస్ట్? అనేది ఇక్కడ తెలుసుకుందాము..
భారత కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన 'రెనాల్ట్ డస్టర్' సరికొత్త పవర్ఫుల్ అవతారంలో కస్టమర్ల ముందుకు వచ్చింది. రెనాల్ట్ ఇండియా తమ ఐకానిక్ డస్టర్ మోడల్లో ‘స్ట్రాంగ్ హైబ్రిడ్’ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశపెట్టింది. రూ. 16.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైన ఈ ఎస్యూవీ మైలేజ్, పర్ఫార్మెన్స్ను కోరుకునే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో నిత్యం ప్రయాణించే వారికి మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్ల పట్ల ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం స్ట్రాంగ్ హైబ్రిడ్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, మారుతీ సుజుకీ విక్టోరిస్ కార్లకు డస్టర్ నేరుగా సవాలు విసురుతోంది.
ఈ నేపథ్యంలో ఈ 3 కార్లతో రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ధర, మైలేజ్‌తో పోల్చి ఏది బెస్ట్? అనేది ఇక్కడ తెలుసుకుందాము..
4 హైబ్రిడ్ కార్ల ధరల సమగ్ర విశ్లేషణ..
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 16.99 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 19.49 లక్షల వరకు నిర్ణయించారు. పోటీదారుల ధరలను పరిశీలిస్తే:
మారుతీ సుజుకీ విక్టోరిస్: రూ. 16.43 లక్షల నుంచి రూ. 19.99 లక్షలు
టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్: రూ. 16.68 లక్షల నుంచి రూ. 19.99 లక్షలు
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా: రూ. 18.71 లక్షల నుంచి రూ. 19.77 లక్షలు
ప్రారంభ ధరల పరంగా విక్టోరిస్ తక్కువ ధరలోనే దొరుకుతున్నప్పటికీ, అగ్రశ్రేణి వేరియంట్ల విషయానికి వచ్చేసరికి డస్టర్ హైబ్రిడ్ (రూ. 19.49 లక్షలు) తన ముగ్గురు పోటీదారుల కంటే తక్కువ ధరకే లభిస్తుండటం కొనుగోలుదారులకు పెద్ద ఊరట!
4 హైబ్రిడ్ కార్ల ఇంజిన్, పర్ఫార్మెన్స్ వివరాలు..
ఈ విభాగంలో ఉన్న ఇతర హైబ్రిడ్ కార్లతో పోలిస్తే డస్టర్ ఎస్యూవీ హెవీ పవర్‌తో వస్తోంది! ఇందులో 1.8-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించారు. ఈ వ్యవస్థ సంయుక్తంగా 160బీహెచ్పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 110బీహెచ్పీ పవర్, 175ఎన్ఎం టార్క్‌ను అందించగా, ఎలక్ట్రిక్ మోటార్ 50బీహెచ్పీ పవర్, 208ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 8-స్పీడ్ డీహెచ్‌టీ గేర్‌బాక్స్, 1.4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది.
పోటీగా ఉన్న గ్రాండ్ విటారా, హైరైడర్, విక్టోరిస్లలో 1.5-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ కలదు. ఇవి కేవలం 115బీహెచ్పీ పవర్‌ను మాత్రమే అందిస్తాయి. వాటితో పోలిస్తే డస్టర్ హైబ్రిడ్ ఏకంగా 45బీహెచ్పీ అదనపు పవర్‌ను కలిగి ఉండటంతో హైవేలపై ప్రయాణం, ఓవర్‌టేకింగ్ అత్యంత సులభమవుతుంది.
మైలేజ్‌లో సరికొత్త రికార్డు!
కంపెనీ ధ్రువీకరించిన గణాంకాల ప్రకారం రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ లీటరుకు ఏకంగా 29 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మారుతీ విక్టోరిస్ 28.65 కేఎంపీఎల్ ఇస్తుండగా, గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌లు 27.97 కేఎంపీఎల్ మైలేజ్‌ను అందిస్తున్నాయి.
ఈ లెక్కన ఈ విభాగంలో అత్యుత్తమ మైలేజ్ అందించే ఎస్‌యూవీగా డస్టర్ ప్రథమ స్థానంలో నిలిచింది.
అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం, ఎక్కువ పవర్, నమ్మశక్యంగాని మైలేజ్, పోటీదారుల కంటే తక్కువ టాప్-ఎండ్ ధరతో వచ్చిన రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్, ఇండియన్ ఎస్యూవీ మార్కెట్లో కొత్త సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


