రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామంలో అర్ధరాత్రి వేళ తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కళాశాలలో సరదాగా గడిపి, స్నేహితులతో కలిసి వేడుక చేసుకున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఊహించని రీతిలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో యశ్వంత్, మోక్ష చరణ్ అనే ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఘటనా స్థలంలోనే మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పోలీస్ వాహనాన్ని చూసి కంగారులో…..

మొయినాబాద్ సమీపంలోని కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో మోక్ష చరణ్ (20), యశ్వంత్ (20) కంప్యూటర్ సైన్స్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల కాలేజీలో నిర్వహించిన ఫెస్ట్ వైభవంగా ముగిసింది. వేడుకలు పూర్తయిన తర్వాత దాదాపు 10 నుంచి 12 మంది విద్యార్థుల బృందం కలిసి పెద్దమంగళారం పరిధిలోని ఓ బహిరంగ ప్రదేశంలో సరదాగా సమయం గడిపేందుకు వెళ్లారు. అక్కడ విద్యార్థులు మద్యం తాగుతూ పార్టీ చేసుకుంటున్న సమయంలో, అదే మార్గంలో సాధారణ తనిఖీల్లో భాగంగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గమనించారు.
రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ పోలీసుల కంటపడితే ఎక్కడ పట్టుబడతామో, కేసులు నమోదు చేస్తారోనన్న తీవ్ర భయాందోళనకు విద్యార్థులు గురయ్యారు. కంగారులో వారంతా చీకట్లోనే తలో దిక్కుకు వేగంగా పరుగులు తీశారు.
విద్యుత్ తీగలకు బలైన యువకులు
పారిపోయే క్రమంలో విద్యార్థులు సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశించారు. అక్కడ పంట రక్షణ కోసం విద్యుత్ తీగలను అమర్చాడు. దట్టమైన చీకటి కారణంగా పొలం చుట్టూ ఉన్న ఆ ప్రమాదకరమైన విద్యుత్ తీగలను విద్యార్థులు గమనించలేకపోయారు.
పరుగెడుతూ వెళ్లి ఆ తీగలను తాకడంతో మోక్ష చరణ్, యశ్వంత్ ఇద్దరూ తీవ్ర విద్యుదాఘాతానికి (ఎలక్ట్రోక్యూషన్) గురయ్యారు. అధిక విద్యుత్ ప్రసారం కావడంతో ఆ ఇద్దరు యువకులూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన విద్యార్థులు భయంతో పరుగులు తీసి తప్పించుకున్నప్పటికీ…. వీరిద్దరూ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి వెతికి చూడగా మృతదేహాలుగా పడి ఉండటం కనిపించింది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పంట రక్షణ పేరుతో అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన రైతుపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
{{/usCountry}}ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పంట రక్షణ పేరుతో అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చిన రైతుపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
{{/usCountry}}ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్తారనుకున్న కన్నబిడ్డలు, క్షణిక భయంతో చేసిన చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోవడంతో వారి తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న వారిని తీవ్రంగా కలిచివేశాయి.