...
...
Next Story

హైదరాబాద్‌లో దారుణం - మటన్‌కు బదులు బీఫ్ సరఫరా, ఇద్దరు అరెస్ట్..!

హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లకు మటన్‌కు బదులుగా బీఫ్ (గోమాంసం) సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Jul 2, 2026, 17:44:17 IST
Advertisement

Food adulteration in Hyderabad : భాగ్యనగరంలో ఆహార ప్రియుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ కొందరు కేటుగాళ్లు బాగోతానికి తెరలేపారు. నగరంలోని పలు హోటళ్లకు మటన్ (మేక మాంసం) అని నమ్మిస్తూ, దానికి బదులుగా బీఫ్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) క్రైమ్ టీమ్, హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) సంయుక్తంగా ఈ ముఠాను గుట్టురట్టు చేశాయి.

వెలుగులోకి కీలక విషయాలు…

హైదరాబాద్‌లో దారుణం - మటన్‌కు బదులు బీఫ్ సరఫరా, ఇద్దరు అరెస్ట్..!
హైదరాబాద్‌లో దారుణం - మటన్‌కు బదులు బీఫ్ సరఫరా, ఇద్దరు అరెస్ట్..!

హైదరాబాద్ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు…. జూలై 1వ తేదీన నిందితులను అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అధికారులు దాదాపు 50 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసంలో మటన్‌తో పాటు బీఫ్‌ను భారీగా మిక్స్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పట్టుబడిన ఇద్దరు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సీసీఎస్ బృందం హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు…. ఈ కల్తీ మాంసం సరఫరా నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించింది? నగరంలో ఏ ఏ హోటళ్లకు, రెస్టారెంట్లకు దీనిని సరఫరా చేశారు…? అనే కోణంలో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నిర్దిష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే ఈ మెరుపు దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదిలావుండగా నగరంలో ఇటీవల కాలంలో ఆహార కల్తీపై నిఘా విభాగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అంతకుముందు జూన్ 19న చార్మినార్ ప్రాంతంలోని హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారితో కలిసి ఆకస్మిక దాడి చేసింది. పంచ్ మొహల్లాలోని న్యూ లాడ్ బజార్‌లో ఉన్న 'అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్' ప్రాంగణాన్ని తనిఖీ చేయగా, అక్కడ అత్యంత ఘోరమైన, అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించేలా ఉందని అధికారులు పేర్కొన్నారు. నగరంలో హోటల్ ఆహార నాణ్యతపై వరుసగా వెలుగుచూస్తున్న ఈ ఘటనలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe