సింగరేణి బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ టెండర్లను రద్దు చేయడంపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీని నియమించింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

"నైనీ కోల్ బ్లాక్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారుల బృందం(ఇద్దరు) సింగరేణిలో పర్యటించనుంది. వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి గల కారణాలను.. ఇతర అంశాలపైనా ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారించనుంది. ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు" అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) అనే బొగ్గు గనుల సంస్థ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తోంది. 51:49 ఈక్విటీ ప్రాతిపదికన యాజమాన్యంలో ఉంది. నైనీ కోల్ బ్లాక్ లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఇటీవలే బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో టెండర్లను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
తాజాగా వెలుగు చూసిన పరిణామాలపై కేంద్ర బృందం విచారించనుంది. ఈ బృందం ఎస్సీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనుంది. మూడు రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ…. కేంద్రానికి 49 శాతం ఈక్విటీ ఉన్నప్పటికీ ఎస్సీసీఎల్ పై తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి పరిపాలనా అధికారాలు ఉన్నాయని చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. టెండర్ల నుంచి కాంట్రాక్టుల వరకూ అన్నీ కేసీఆర్ కుటుంబమే చూసేదన్నారు. ఆ సంస్థ సీఎస్‌ఆర్ నిధులు కూడా దుర్వినియోగం చేశారని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సింగరేణిలో అవినీతి, అవకతవకలు కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.ఈ రెండు పార్టీలు కూడా సింగరేణిని బలహీనపర్చాయని విమర్శించారు. టెండర్ల రద్దు గురించి ప్రస్తావిస్తూ… రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమని గుర్తుచేశారు.
{{/usCountry}}కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సింగరేణిలో అవినీతి, అవకతవకలు కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.ఈ రెండు పార్టీలు కూడా సింగరేణిని బలహీనపర్చాయని విమర్శించారు. టెండర్ల రద్దు గురించి ప్రస్తావిస్తూ… రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమని గుర్తుచేశారు.
{{/usCountry}}