హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో MBA అడ్మిషన్లు - నోటిఫికేషన్ వివరాలు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎంబీఏ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. 2026-2028 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంబీఏ ప్రవేశాల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ అయింది. రెండేళ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) ఫుల్ టైం ప్రోగ్రామ్ లో అడ్మిషన్లు కల్పిస్తారు. మొత్తం 75 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జనవరి 31వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఈ అడ్మిషన్ల కోసం క్యాట్ 2025 లేదా ఏఐఎంఏ నిర్వహించిన ఎంఏటీ-2025 లేదా NTA నిర్వహించిన సీఎంటీఏ-2026లో హాజరైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
ఎంబీఏ అడ్మిషన్ల నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
- యూనివర్శిటీ - హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ
- ప్రవేశాలు - ఎంబీఏ
- కోర్సు వ్యవధి - రెండేళ్లు
- మొత్తం సీట్లు - 75 సీట్లు
- ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తు ఫీజు కింద జనరల్ రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీలకు రూ.400, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.275 చెల్లించాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 31 జనవరి 2026
- గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://acad.uohyd.ac.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

