...
...
Next Story

HCU Recruitment 2026 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి హెల్పర్ ఉద్యోగ నోటిఫికేషన్ - ఇంటర్ అర్హతతోనే..!

University of Hyderabad Jobs 2026 : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. బయోకెమిస్ట్రీ విభాగంలోని రీసెర్చ్ ప్రాజెక్టులో తాత్కాలిక ప్రాతిపదికన ఆఫీస్ హెల్పర్ పోస్టు భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Jun 22, 2026 08:41 AM IST
Advertisement

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (UoH) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ పరిధిలో ఉన్న బయోకెమిస్ట్రీ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న ఆఫీస్ హెల్పర్ పోస్టు భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ముఖ్యమైన వివరాలు :

  • పోస్టు పేరు: ఆఫీస్ హెల్పర్
  • ఖాళీల సంఖ్య: ఒకటి (1)
  • వేతనం: నిబంధనల ప్రకారం నెలకు రూ. 26,800 చొప్పున చెల్లిస్తారు.
  • ఉద్యోగ కాలపరిమితి: ప్రాథమికంగా ఏడాది పాటు నియమిస్తారు. ప్రాజెక్ట్ అవసరాలు, అభ్యర్థి పనితీరు ఆధారంగా ప్రాజెక్ట్ ముగిసే వరకు (గరిష్టంగా 3 సంవత్సరాలు) ఈ కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉంటుంది.
  • అర్హతలు : అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. లేబొరేటరీలో ఉపయోగించే గ్లాస్‌వేర్ (గాజు వస్తువులు) శుభ్రం చేయడం, ల్యాబ్ నిర్వహణలో సహాయపడటం, జంతువుల (అనిమల్ హౌస్) పర్యవేక్షణపై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
  • అనుభవం : కెమికల్ లేదా బయోలాజికల్ లాబొరేటరీలలో పనిచేసిన ముందస్తు అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
  • వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లకు మించకూడదు.
  • ఈ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. భవిష్యత్తులో యూనివర్సిటీలో శాశ్వత ఉద్యోగం క్లెయిమ్ చేయడానికి అభ్యర్థులకు ఎలాంటి హక్కు ఉండదు.
  • రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్‌కు హాజరయ్యేందుకు గానీ…. ఉద్యోగంలో చేరే సమయంలో గానీ ఎలాంటి టీఏ, డీఏ (ప్రయాణ భత్యాలు) చెల్లించరు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంతో పాటు విద్యార్హతలు, వయస్సు, అనుభవానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాల స్వయం ధృవీకరణ (Self-Attested) నకళ్లను తప్పనిసరిగా జతపరచాలి.

దరఖాస్తు విధానం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ

నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చిన నిర్ణీత ఫార్మాట్ (ఫారమ్ బి) లో గానీ తమ వివరాలను నింపి నేరుగా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భర్తీ చేసిన దరఖాస్తులు చేరుకోవడానికి చివరి తేదీ 2026 జూన్ 25.

  • దరఖాస్తులను పంపాల్సిన చిరునామా: ప్రొఫెసర్ బ్రహ్మానందం మానవతి, బయోకెమిస్ట్రీ విభాగం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్... హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ - 500046, తెలంగాణ.
  • సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 040-23134546
  • అధికారిక వెబ్ సైట్ - https://uohyd.ac.in/non-teaching

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe