వాహనదారులకు అలర్ట్.. వాహన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి!
వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు. వాహన్ పోర్టల్‌లో మెుబైల్ నంబర్, ఈ-మెయిల్ అప్డేట్ చేసుకోవాలని తెలిపారు.
మీ వాహనానికి సంబంధించిన ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాలు(E-Challan), ఇతర కీలక సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా సకాలంలో తెలుసుకోవడానికి రవాణా శాఖ కీలక సూచన చేసింది. వెంటనే వాహన్(VAHAN) పోర్టల్‌లో మీ ప్రస్తుత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

కాంటాక్ట్ వివరాల అప్‌డేట్ ఎందుకు తప్పనిసరి?
చాలామంది వాహనం కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన పాత నంబర్లను మార్చకపోవడం వల్ల చలానాల సమాచారం అందడం లేదు. కాంటాక్ట్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, నోటిఫికేషన్లు అందకపోవడం వల్ల పడే భారీ జరిమానాల భారం నుంచి తప్పుకోవచ్చు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 'వాహన్' పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపిన చలానాలను వాహన యజమానికి అధికారికంగా చేరినట్లుగానే పరిగణిస్తారు. నాకు మెసేజ్ రాలేదు అని చెప్పే అవకాశం ఇకపై ఉండదు. వాహనదారులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా, వేగంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
అప్డేట్ చేసుకోవడం ఎలా?
స్టెప్ 1: మొదట అధికారిక వెబ్‌సైట్ vahan.parivahan.gov.in ను సందర్శించండి లేదా ఇచ్చిన క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయండి(హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్యూఆర్ కోడ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు).
స్టెప్ 2: హోంపేజీలో 'Online Services' మెనూపై క్లిక్ చేసి, 'Vehicle Related Services' ఆప్షన్ ఎంచుకోండి.
స్టెప్ 3: మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, ఆర్టీఓ ఎంటర్ చేయాలి, తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయండి.
స్టెప్ 4: అనంతరం 'Services' సెక్షన్‌లోకి వెళ్లి 'Update Mobile Number' పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: మీ వాహన చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్, రిజిస్ట్రేషన్ తేదీ వివరాలను నమోదు చేసి, ఆధార్ ఓటీపీ ద్వారా మీ కొత్త మొబైల్ నంబర్‌ను సురక్షితంగా లింక్ చేసుకోండి.
అప్‌డేట్ చేసుకోకపోతే వచ్చే నష్టాలు
మీ నంబర్‌పై ఇతరులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే మీకు సమాచారం అందదు. సకాలంలో చలానా చెల్లించకపోతే నేరుగా కోర్టు సమన్లు వచ్చే ప్రమాదం ఉంది. పెండింగ్ చలానాలు ఉంటే వాహనం ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఎన్‌ఓసీ, లేదా యాజమాన్య బదిలీ ప్రక్రియలు నిలిచిపోతాయి.
మీ వాహన ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాలతో పాటు ఇతర కీలక సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా, సకాలంలో తెలుసుకోవడానికి.. వెంటనే 'వాహన్' (VAHAN) పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్‌డేట్ చేసుకోండి.
కాంటాక్ట్ వివరాలను అప్ డేట్ చేసుకోవడం ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, నోటిఫికేషన్లు అందకపోవడం వల్ల పడే జరిమానాల భారం నుంచి తప్పుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 'వాహన్' పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపిన చలానాలను వాహన యజమానికి అధికారికంగా చేరినట్లుగానే పరిగణిస్తారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


