Telangana: పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ - పుకార్లు నమ్మవద్దని ప్రభుత్వం ప్రకటన

రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. వదంతులు నమ్మవద్దని సూచించింది.

Updated on: Mar 25, 2026, 07:55:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంధన కొరతతో పెట్రోల్ బంకులు మూతపడతాయనే ప్రచారంతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. మంగళవారం హైదరాబాద్ లోని చాలా పెట్రోల్ బంకుల వద్ద బారులు కనిపించాయి. కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపించాయి.

పెట్రోల్‌ బంక్‌ల వద్ద రద్దీ
పెట్రోల్‌ బంక్‌ల వద్ద రద్దీ

కొరత లేదు - పౌరసరఫరాల శాఖ

ఈ పరిస్థితులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది.రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

పెట్రోల్, డీజిల్షార్టేజీ అంటూ వచ్చిన వదంతుల నేపథ్యంలో చాలా బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయని తెలిపింది. అనవసరమైన భయాందోళనల ఫలితంగా ఈ తరహా కృతిమ కొరతకు దారి తీసిందని పేర్కొంది.

ఇందన కొరత వదంతుల నేపథ్యంలో వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోందని పౌరసరఫరాల శాఖ తెలిపింది. డిపోలలో తగినంత ఇంధనం అందుబాటులో ఉన్నప్పటికీ… ఇది కృత్రిమ కొరతను సృష్టిస్తుందని అని ప్రకటన తెలిపింది.

చమురు మార్కెటింగ్ కంపెనీల (OMC) అడ్వాన్స్-చెల్లింపు నమూనాలకు సంబంధించి ఇటీవలే పరిపాలనా మార్పులు జరిగాయని వివరించింది. ఈ మార్పుల కారణంగా స్థానిక డీలర్లకు మాత్రమే చిన్నపాటి తాత్కాలిక సమస్యలు ఎదురయ్యాయని క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం అంతర్గత, పరిపాలనపరమైన విషయమని స్పష్టం చేసింది.

మరోవైపు రాష్ట్రంలోని ఇంధన అవుట్లెట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంధనాన్ని నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడటం లేదా దేశీయ ఎల్పిజి సిలిండర్లను వాణిజ్య ఉపయోగం కోసం చట్టవిరుద్ధంగా మళ్లించడంపై నిఘా పెడుతున్నారు. ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనలతో కొనుగోళ్లు చేయకుండా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. "అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. సోషల్ మీడియాలో ధృవీకరించని పుకార్లను నమ్మడం లేదా ఫార్వార్డ్ చేయకండి" అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నాలున్నా…. అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నా పౌరసరఫరాల శాఖ టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1967ను సంప్రదించాలని సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More