...
...
Next Story

వేములవాడలో ఆలయం అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా రాజన్న దర్శనం!

వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే పనులు ముగిసేవరకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారానే దర్శనం కల్పించనున్నారు.

Published on: Oct 14, 2025, 14:12:40 IST
Advertisement

వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయి. భక్తుల సౌకర్యం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయం అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా దర్శనం కల్పిస్తారు. భక్తుల కోసం ఆర్జిత సేవలు కూడా తాత్కాలికంగా అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక సేవలు, ప్రసాదాల పంపిణీ, వసతి సదుపాయాలను కూడా తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

వేములవాడ రాజన్న ఆలయం
వేములవాడ రాజన్న ఆలయం

భక్తుల అభ్యంతరాల నేపథ్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ఎల్ఈడీ స్క్రీన్, తాత్కాలిక ఏర్పాట్ల ద్వారా స్వామివారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు అధికారులు. దేవాదాయ శాఖ భక్తుల కోసం ఆలయంలో అర్జిత సేవలను కూడా అందిస్తుంది. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు భక్తుల సౌలభ్యం కోసం ఈ ఏర్పాట్లు కొనసాగుతాయి. భక్తుల మనోభావాలు, అర్చకులు, వేద పండితుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంపై వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా భక్తులకు తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేశారు. రాజరాజేశ్వర స్వామి మందిరం అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు.

ప్రధాన ఆలయంలో ఏకాంత సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఇటీవల ప్రకటనలో తెలిపారు అధికారులు. భీమేశ్వరాలయంలో కోడెమొక్కు, అభిషేకాలు, కుంకుమపూజ, నిత్య కల్యాణం, చండీయాగం వంటి పూజలు జరుగుతాయన్నారు. ఆలయాన్ని మూసివేయడం లేదని కార్యనిర్వాహక అధికారిణి రమాదేవి అన్నారు. 'పనులు జరుగుతున్న సమయంలో భక్తులు భీమేశ్వరాలయంలో అన్ని పూజలు కొనసాగించవచ్చు.' అని ఇటీవల పేర్కొన్నారు

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks