Vijaya Dairy Milk Price : విజయ డెయిరీ పాల ధరలు పెంపు - లీటరుపై ఎంతంటే..?

రాష్ట్రంలో విజయ డెయిరీ పాల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్టాండర్డైజ్డ్, హోల్ మిల్క్ 500 మి.లీ ప్యాకెట్లపై రూ. 1 చొప్పున పెంపు అమల్లోకి వచ్చింది.

Published on: Oct 17, 2026, 12:22:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరమైన విజయ పాల ధరలు పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (TGDDCF) కీలక నిర్ణయం తీసుకుంది. విజయ తెలంగాణ బ్రాండ్ కింద విక్రయించే స్టాండర్డైజ్డ్ మిల్క్ మరియు హోల్ మిల్క్ రకాలపై 500 మి.లీ (అర లీటరు) ప్యాకెట్‌కు రూ. 1 చొప్పున ధరను సవరించింది. ఈ పెంచిన సవరించిన ధరలు అక్టోబర్ 17 నుంచే (అక్టోబర్ 16 రాత్రి సప్లైల నుంచి) అమల్లోకి వస్తున్నాయని అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

విజయ డెయిరీ పాల ధరలు పెంపు
విజయ డెయిరీ పాల ధరలు పెంపు

ధరల వివరాలు:

  • స్టాండర్డైజ్డ్ మిల్క్ (500 మి.లీ ): ఇప్పటివరకు అర లీటరు ప్యాకెట్ ఎంఆర్‌పీ రూ. 34 ఉండగా, తాజా పెంపుతో ఇది రూ. 35కి చేరింది.
  • హోల్ మిల్క్ (500 మి.లీ) : గతంలో ఈ అర లీటరు ప్యాకెట్ ఎంఆర్‌పీ రూ. 39 ఉండగా, సవరించిన ధరల ప్రకారం రూ. 40కి పెరిగింది.

అర లీటరుపై రూపాయి పెరగా… లీటర్ పై రూ. 2 పెంపు ఉంటుంది. ఇక ఈ కొత్త ధరల మార్పును సాధారణ వినియోగదారులు, పాల వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, విద్యా సంస్థలు/రైస్ మిల్లులు వంటి అనుబంధ సంస్థలు, మోడరన్ రిటైల్ మాల్స్, క్విక్ కామర్స్ ఆన్‌లైన్ యాప్‌ల యాజమాన్యాలు గమనించాలని జనరల్ మేనేజర్ సూచించారు. పాల సేవలు, వినియోగదారుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లను 040-27019851-54 సంప్రదించవచ్చని కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతుల నుంచి పాల సేకరణ వ్యయం పెరగడం, రవాణా ఖర్చులు తీవ్రంగా కావడం మరియు నిర్వహణ వ్యయంలో వస్తున్న హెచ్చుతగ్గుల వల్లే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని డెయిరీ వర్గాలు స్పష్టం చేశాయి. పాడి పరిశ్రమను లాభసాటిగా నడపడంతో పాటు రైతులకు మద్దతుగా నిలిచేందుకే స్వల్పంగా ధరలను పెంచినట్లు వివరించాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More