మెదక్ జిల్లా అల్లదుర్గం మండలంలోని బహిరన్ దిబ్బ గ్రామంలో రాబందును చూసి జనాలు ఆందోళన పడ్డారు. దీనికి కారణం ఆ పక్షి కాలికి ట్రాకర్ ఉండటమే. ఇది చూసిన జనం ఏదో కీడు జరుగుతుందని కూడా చర్చించారు. రాబందు కాలికి స్టిక్కర్లు, నంబర్లు, చిన్న పరికరాలు ఉండే సరికి అనుమానాలు ఎక్కువ అయ్యాయి. అయితే అటవీ శాఖ అధికారులు వచ్చి క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామ శివారులో ఒక రాబందు కనిపించింది. నిజానికి రాబందులు కనిపించడం అరుదు కదా. దీంతో గ్రామస్థుల్లో భయం మెుదలైంది. ఆకాశం నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఈ పక్షిని చూసిన జనాలు ఆలోచనల్లో పడ్డారు. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇక ఆ పక్షి కాళ్లకు స్టిక్కర్లు, నంబర్లు, చిన్న పరికరాలు ఉండటంతో ఆశ్చర్యంగా చూశారు.
అయితే కొందరు యువకులు పరికరాలను చూసి ఏదైనా గూఢచారి పక్షి కావొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. మరికొందరైతే గ్రామానికి ఏదైనా కీడు జరుగుతుందని కూడా మాట్లాడుకున్నారు. ఈ రాబందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు కూడా తెలిసింది. దీంతో వారు రంగంలోకి దిగారు.
దీనిపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో అంతరించిపోతున్న రాబందుల జాతిని కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంరక్షణ ప్రాజెక్టును అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే.. రాబందుల కదలికలు, నివాస ప్రాంతాలు, ఆహార లభ్యత లాంటి అంశాలను అధ్యయనం చేసేందుకు వాటి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్లు, గుర్తింపు ట్యాగులు అమర్చుతున్నారన్నారు. ఈ రాబందులు దేశవ్యాప్తంగా ఎక్కడ తిరిగినా.. వాటి లొకేషన్‌ను వైల్డ్ లైఫ్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు.
ఈ టెక్నాలజీ ద్వారా రాబందుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన శాస్త్రీస సమాచారం సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రాబందుల రక్షణ అందరి బాధ్యత అని చెప్పారు. ఈ పక్షులకు హాని కలిగించినా.., పట్టుకునేందుకు ప్రయత్నించినా.. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామస్థులు ఎలాంటి భయం లేకుండా రాబందును పట్టించుకోకుండా వెళ్లాలని చెప్పారు.
{{/usCountry}}ఈ టెక్నాలజీ ద్వారా రాబందుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన శాస్త్రీస సమాచారం సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రాబందుల రక్షణ అందరి బాధ్యత అని చెప్పారు. ఈ పక్షులకు హాని కలిగించినా.., పట్టుకునేందుకు ప్రయత్నించినా.. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామస్థులు ఎలాంటి భయం లేకుండా రాబందును పట్టించుకోకుండా వెళ్లాలని చెప్పారు.
{{/usCountry}}