జీపీఎస్ ట్రాకర్‌తో మెదక్‌లో రాబందు.. ఏదో అవుతుందనుకుని భయంలో జనం!

మెదక్ జిల్లాలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాలికి జీపీఎస్ ట్రాకర్‌తో ఒక రాబందు సంచరించింది.

Published on: Jan 18, 2026, 15:34:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెదక్ జిల్లా అల్లదుర్గం మండలంలోని బహిరన్ దిబ్బ గ్రామంలో రాబందును చూసి జనాలు ఆందోళన పడ్డారు. దీనికి కారణం ఆ పక్షి కాలికి ట్రాకర్ ఉండటమే. ఇది చూసిన జనం ఏదో కీడు జరుగుతుందని కూడా చర్చించారు. రాబందు కాలికి స్టిక్కర్లు, నంబర్లు, చిన్న పరికరాలు ఉండే సరికి అనుమానాలు ఎక్కువ అయ్యాయి. అయితే అటవీ శాఖ అధికారులు వచ్చి క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మెదక్‌లో రాబందు
మెదక్‌లో రాబందు

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామ శివారులో ఒక రాబందు కనిపించింది. నిజానికి రాబందులు కనిపించడం అరుదు కదా. దీంతో గ్రామస్థుల్లో భయం మెుదలైంది. ఆకాశం నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఈ పక్షిని చూసిన జనాలు ఆలోచనల్లో పడ్డారు. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇక ఆ పక్షి కాళ్లకు స్టిక్కర్లు, నంబర్లు, చిన్న పరికరాలు ఉండటంతో ఆశ్చర్యంగా చూశారు.

అయితే కొందరు యువకులు పరికరాలను చూసి ఏదైనా గూఢచారి పక్షి కావొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. మరికొందరైతే గ్రామానికి ఏదైనా కీడు జరుగుతుందని కూడా మాట్లాడుకున్నారు. ఈ రాబందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు కూడా తెలిసింది. దీంతో వారు రంగంలోకి దిగారు.

దీనిపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో అంతరించిపోతున్న రాబందుల జాతిని కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంరక్షణ ప్రాజెక్టును అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే.. రాబందుల కదలికలు, నివాస ప్రాంతాలు, ఆహార లభ్యత లాంటి అంశాలను అధ్యయనం చేసేందుకు వాటి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్లు, గుర్తింపు ట్యాగులు అమర్చుతున్నారన్నారు. ఈ రాబందులు దేశవ్యాప్తంగా ఎక్కడ తిరిగినా.. వాటి లొకేషన్‌ను వైల్డ్ లైఫ్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు.

టెక్నాలజీ ద్వారా రాబందుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన శాస్త్రీస సమాచారం సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రాబందుల రక్షణ అందరి బాధ్యత అని చెప్పారు. ఈ పక్షులకు హాని కలిగించినా.., పట్టుకునేందుకు ప్రయత్నించినా.. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామస్థులు ఎలాంటి భయం లేకుండా రాబందును పట్టించుకోకుండా వెళ్లాలని చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More