హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అలర్ట్ ఇచ్చింది. కృష్ణా ఫేజ్ - 1లో జరిగే మరమ్మత్తు పనుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈనెల 27 ఉదయం నుంచి 28వ తేదీ సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని HMWSSB ప్రకటించింది.
మరమ్మత్తు పనుల ఎఫెక్ట్…

జలమండలి ప్రకటించిన వివరాల ప్రకారం…. హైదరాబాద్ సిటీకి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్ - 1 లో సర్జ్ ట్యాంక్ వద్ద ఉన్న 700 మిమీ డయా ఎంఎస్ పైప్ లైన్ కు ఏర్పడిన లీకేజీని అరికట్టే పనులు జరగనున్నాయి. అంతేకాకుండా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2200 మిమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌లో దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వులను మార్పిడి చేస్తారు. నాసర్లపల్లి వద్ద 2200 మిమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై 600 మిమీ డయా ఎంఎస్ జంక్షన్ పనులు చేపట్టడంతో పాటు కోదండాపూర్, నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్లలో ఉన్న 600 మిమీ డయా పై దెబ్బతిన్న బిఎఫ్ valveలు, ఎన్ఆర్v లను మార్పిడి చేయనున్నారు.
డిసెంబర్ 27వ తేదీ ఉదయం 6 గంటల ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులన్నీ జరుగుతాయి. ఫలితంగా దాదాపు 36 గంటలపాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరా తిరిగి పునరుద్ధరిస్తారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. డివిజన్ నెం. I: మీరాలం, కిషన్‌బాగ్, బాల్షెట్టీ కేట్, మొగల్ పురా, ఫలక్‌నామా, బహదూర్‌పురా, జహనుమా.
2. డివిజన్ నెం. II: మహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్, యాకుత్‌పురా.
{{/usCountry}}2. డివిజన్ నెం. II: మహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్, యాకుత్‌పురా.
{{/usCountry}}3. డివిజన్ నెం. IV: బొగ్గులకుంట.
3. డివిజన్ నెం. V: నారాయణగూడ, ఆడిక్‌మెట్ రిజర్వాయర్, శివం రిజర్వాయర్, చిల్కలగూడ రిజర్వాయర్.
5. డివిజన్ నెం. VIII: అలియాబాద్ రిజర్వాయర్, రియాసత్ నగర్ రిజర్వాయర్.
6. డివిజన్ నెం. X: దిల్ సుఖ్ నగర్ లోని కొన్ని ప్రాంతాలు.
7. డివిజన్ నెం. XVIII: హార్డ్ వేర్ పార్క్, జల్ పల్లి, తుక్కుగూడ, ఫాబ్ సిటీ.
8.డివిజన్ నెం. XX: మన్నెగూడా.
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటి వాడకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ముందస్తు ప్రకటన నేపథ్యంలో… తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.