ఎల్‌నినో ప్రభావం వల్ల తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తీవ్రమయ్యాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవడంతో ఈ వర్షాకాలంలోనే అత్యంత దారుణమైన నెలగా నమోదైంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం.. ఆగస్టు నెలలో సాధారణంగా నమోదు కావాల్సిన 215.8 మిమీ వర్షపాతానికి గాను కేవలం 134.5 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో మొత్తంగా 38 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం దారుణంగా పడిపోయింది. 2025 ఆగస్టు నెలలో రాష్ట్రంలో 378.5 మిమీ వర్షపాతం నమోదు కాగా.. 2026 ఆగస్టులో నమోదైన వర్షపాతం దాదాపు 64 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. వర్షాకాలంలో సుదీర్ఘ పొడివాతావరణం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం సాధారణమే అయినప్పటికీ, ఆగస్టులో వర్షపాత వ్యత్యసానికి ప్రధాన కారణం ఎల్‌నినో ప్రభావమేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆగస్టు నెలలో వర్షపాతం అత్యంత అస్థిరంగా సాగింది. నెల ప్రారంభంలో లోటు 40 శాతానికి పైగా ఉండగా, ఆగస్టు 3 నాటికి అది 49 శాతానికి చేరింది. ఆ తర్వాత కురిసిన వర్షాలతో ఆగస్టు 4 నాటికి పరిస్థితి కాస్త మెరుగుపడి 13 శాతం మిగులు వర్షపాతం నమోదైంది. కానీ ఆగస్టు 5 నాటికి మళ్లీ 2 శాతం లోటులోకి వెళ్లిన రాష్ట్రం, ఆగస్టు 22 నాటికి 39 శాతానికి చేరుకుంది. చివరకు ఆగస్టు 31 నాటికి 38 శాతం లోటుతో ముగిసింది. అంతకుముందు జూన్‌లో 12 శాతం లోటు, జులైలో కేవలం 1 శాతం మాత్రమే లోటు నమోదు కాగా, ఆగస్టు నెలలో పరిస్థితి మరింత దిగజారింది.
ఆగస్టులో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, వ్యవస్థలు తెలంగాణపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. నెలలో మొత్తం మూడు వాతావరణ వ్యవస్థలు ఏర్పడినప్పటికీ, అవన్నీ వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల మీదుగానే పయనించాయి. తెలంగాణ ఈ వ్యవస్థల సరిహద్దుల్లో ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొన్నాయి.
{{/usCountry}}ఆగస్టులో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, వ్యవస్థలు తెలంగాణపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. నెలలో మొత్తం మూడు వాతావరణ వ్యవస్థలు ఏర్పడినప్పటికీ, అవన్నీ వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల మీదుగానే పయనించాయి. తెలంగాణ ఈ వ్యవస్థల సరిహద్దుల్లో ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొన్నాయి.
{{/usCountry}}జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల కాలానికి గాను సాధారణ వర్షపాతం 573.5 మిమీ ఉండాల్సి ఉండగా.. కేవలం 473.8 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో మొత్తంగా 17 శాతం లోటు ఏర్పడింది.
గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో వర్షపాత లోటు మరింత ఎక్కువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలో జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 459.7 మిమీ సాధారణ వర్షపాతానికి గాను కేవలం 359.6 మిమీ వర్షపాతం మాత్రమే నమోదై, 22 శాతం లోటు నమోదైంది.