...
...
Next Story

వెదర్ అలర్ట్.. తెలంగాణలో ఈ తేదీల్లో తీవ్రమైన చలి గాలులు.. జాగ్రత్త!

తెలంగాణలో కొన్ని రోజులుగా చలి పెరుగుతోంది. రోజురోజుకు చలితీవ్రత పెరుగుతుంది. అయితే తాజాగా వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసింది.

Published on: Nov 9, 2025, 20:03:18 IST
Advertisement

తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెగుతుంది. నవంబర్ 11 నుంచి 19 మధ్య తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 13 నుండి 17 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

తెలంగాణలో చలి గాలులు
తెలంగాణలో చలి గాలులు

తెలంగాణలోని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలు, 14 డిగ్రీల మధ్య ఉంటాయని అంచనా. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న జిల్లాల్లో 14 డిగ్రీలు, 17 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది.

8 నుంచి 10 రోజులు ఇలా దీర్ఘకాలం పాటు చలి పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కాలంలో అసాధారణమని, ఈ సంవత్సరం చలి సాధారణం కంటే ఎక్కువ కాలం ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం(TSDPS) నుండి వచ్చిన అంచనా డేటా ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. వారాంతం నాటికి ఆదిలాబాద్‌లో కనిష్టంగా 11.2 డిగ్రీలు, కుమరం భీమ్‌లో 9.4 డిగ్రీలు, మంచిర్యాలలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

మధ్య, ఉత్తర జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలు, 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతో సహా దక్షిణ ప్రాంతాలలో 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య ఉండవచ్చు. నవంబర్ చివరి నుండి తెలంగాణ అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య ఉంటాయని అంచనా.

ఇప్పటికే రాజధాని హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21.5 డిగ్రీలు నమోదైంది. ఇది చల్లని రాత్రుల ప్రారంభాన్ని చెబుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిమితుల్లో శేరిలింగంపల్లి 17.4 డిగ్రీల వద్ద అత్యంత చల్లని ప్రదేశంగా ఉండగా, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ 20.5 డిగ్రీల వద్ద ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe