తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి వెల్లడించింది. 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలో 4 రోజులు వర్షాలు కురవనున్నాయి.

కోస్తాలో బలమైన గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నల్గొండలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
రాబోయే ఏడు రోజుల్లో హైదరాబాద్‌తో సహా అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికను జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసిన ఏడు రోజుల సూచన ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, భద్రాచలం లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ) సంభవించే అవకాశం ఉంది.
అక్టోబర్ 24 నుండి 27 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుండి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీ, విద్యుత్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
{{/usCountry}}అక్టోబర్ 24 నుండి 27 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుండి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీ, విద్యుత్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
{{/usCountry}}హైదరాబాద్‌కు సంబంధించి శుక్రవారం, శనివారం అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, సాయంత్రం వేళల్లో ఈదురుగాలులు, మెరుపులు కురిసే అవకాశం ఉందని అంచనా. అక్టోబర్ 28 నుండి రాష్ట్రంలో వర్షపాతం తీవ్రత కొద్దిగా తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి సహా కొన్ని జిల్లాల్లో అప్పుడప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగవచ్చు.